Breaking News

వాచ్‌మెన్‌పై పెట్రోల్ దాడి.. తన అల్లుడి పాత్రపై క్లారిటీ ఇచ్చిన మంత్రి మల్లారెడ్డి


ఓల్డ్ బోయిన్‌పల్లిలోని వైశ్యా బ్యాంక్ కాలనీలో శివ ఎన్‌క్లేవ్ హౌసింగ్ సొసైటీలో కొద్దిరోజుల క్రితం వాచ్‌మెన్‌పై జరిగిన పెట్రోల్ దాడి రాజకీయంగా కలకలం రేపుతోంది. సొసైటీలో రెండు వర్గాల మధ్య జరుగుతున్న భూవివాదంలో భాగంగా ఓ వర్గం వాచ్‌మెన్ శరణప్పపై పెట్రోల్ జల్లి నిప్పటించేందుకు ప్రయత్నించింది. ఈ కేసులో పెద్ద మనుషుల ప్రమేయం ఉండటంతో పోలీసులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. Also Read: ఈ ఘటనలో ఓ వర్గానికి మద్దతుగా తెలంగాణ అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి పోలీసులపై ఒత్తిడి తెచ్చారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయన్ని రహస్యంగా విచారించినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసుతో తనకు గానీ, తన అల్లుడికి గానీ ఎలాంటి సంబంధం లేదని మంత్రి మల్లారెడ్డి బుధవారం స్పష్టం చేశారు. తాము ఏ భూవివాదంలోనూ తలదూర్చలేదని తెలిపారు. అధికారంలో ఉన్నందున తమను రోజూ ఎంతోమంది వచ్చి కలుస్తుంటారని, ఎవరో చేసిన పనిని తమకు అంటగట్టాలని కొందరు ప్రయత్నిస్తున్నారని అన్నారు. Also Read: తమకే రూ.500కోట్ల ఆస్తులున్నాయని, డబ్బు కోసం సెటిల్‌మెంట్లు చేసే అవసరం తమకు లేదన్నారు. మరోవైపు ఈ ఘటనలో నిందితులైన తూముకుంట మాధవరెడ్డి, సామల మాధవరెడ్డి, జక్కుల సురేందర్‌రెడ్డిని తెలంగాణ పోలీసులు పుణెలో అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ కేసు రాజకీయ రంగు పులుముకోవడంతో పోలీసులు జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు. Also Read:


By December 12, 2019 at 09:40AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/petrol-attack-on-watchman-minister-malla-reddy-gives-clarity-on-his-son-in-law-role/articleshow/72484589.cms

No comments