సమయం లైవ్ న్యూస్: ఆర్టీసీ ఉద్యోగులకు జగన్ గుడ్ న్యూస్

⍟ వామ్మో ఢిల్లీకా... ఏపీ గవర్నర్: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ విజయవాడ లయోలా కాలేజీలో బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. వాతావరణంలో కలిగే మార్పులు భావి తరాలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని అన్నారు. కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ⍟ ఆర్టీసీ కార్మికులకు జగన్ గుడ్ న్యూస్: ప్రభుత్వంలో ఏపీఎస్ ఆర్టీసీ విలీనానికి సంబంధించి జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లింది. బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రవాణా, రోడ్లు– రహదారులు–భవనాలశాఖలోనే ఈ విభాగం ఏర్పాటు చేయనున్నారు. ⍟ జగన్‌పై రోజా ప్రశంసలు: జగన్ సర్కార్ మహిళ భద్రత కోసం సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళలపై అత్యాచారాలు, నేరాలకు పాల్పడే వారికి సత్వరమే కఠిన శిక్ష విధించేలా ముసాయిదా బిల్లను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. బుధవారం జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో ఆమోదం కూడా తెలిపారు. ⍟ వైసీపీ ఎంపీ విందులో ఆసక్తిర పరిణామం: నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇటీవల బీజేపీ నేతలతో సన్నిహితంగా మెలుగుతున్నారు. బుధవారం రాత్రి ఆయన ఢిల్లీలో ఎంపీలకు విందు ఇచ్చారు. ప్రధాని మోదీ ఆయన్ను ఆప్యాయంగా పలకించారు. అమిత్ షా సైతం.. మిగతా వైఎస్సార్సీపీ నేతల కంటే ముందు ఆయనకు అపాయింట్‌మెంట్ ఇస్తున్నారు. దీంతో ఆయన బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ⍟ ఆ యాక్సిడెంట్ చేసిన వ్యక్తి వీడియో గేమ్ సంస్థ ఓనర్: పెద్ద పెద్ద భవంతులు, ఆకాశ హార్మ్యాలు.. వాటి మధ్య రయ్ రయ్ అంటూ వేగంతో దూసుకెళ్లే కార్లు, బైక్‌లు.. మధ్యలో ఛేజింగ్‌లు, ఫైటింగ్‌లు.. ఊహించని టర్నింగ్‌లు, శత్రువుల దాడి.. వీటన్నింటినీ వీడియో గేమ్స్‌లో చూస్తుంటాం.. బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై ప్రమాదానికి కారణమైన కారు కూడా వీడియో గేమ్‌లో చూసిన విధంగానే దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కీలకమైన విషయం ఏమిటంటే.. ఆ కారు నడిపిన వ్యక్తి కల్వకుంట్ల కృష్ణమిలన్ రావు కూడా వీడియో గేమ్స్ రూపొందించే ఓ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో కావడం.
By December 12, 2019 at 08:29AM
No comments