Breaking News

సమయం లైవ్ న్యూస్: కర్ణాటక ఉప-ఎన్నికల్లో బీజేపీ హవా.. వైసీపీ ఎమ్మెల్యేకి ఓ వ్యక్తి హెచ్చరిక


⍟ కర్ణాటక ఉప-ఎన్నికల్లో బీజేపీ హవా: కర్ణాటకలో డిసెంబరు 5న జరిగిన ఉప-ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం మొదలైంది. మొత్తం 15 స్థానాలకు గానూ 10 చోట్ల బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ రెండు, జేడీఎస్‌ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు. పూర్తి వివరాలు కాసేపట్లో .. ⍟ ఎస్కేయూ వీసీ హఠాన్మరణం: అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ (ఎస్కేయూ) వైస్-ఛాన్సలర్ జయరాజ్‌ ఆదివారం రాత్రి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆదివారం రాత్రి ఆయన అనంతపురం నుంచి విజయవాడకు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులో వెళ్తుండగా గుండెపోటుకు గురయ్యారు. కర్నూలు జిల్లా డోన్‌ వద్దకు వచ్చేసరికి ఆయనకు గుండెపోటు రావడంతో బస్సులోనే కుప్పకులిపోయారు. ⍟ చిలకలూరిపేట ఎమ్మెల్యేపై ఆరోపణ: గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే రజినిపై ఓ వ్యక్తి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఎస్సీ కార్పొరేషన్ నుంచి తనకు మంజూరు చేసిన కారును రాకుండా ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అధికారులకు చెప్పి.. గత ఆరు నెలలుగా కారు తనకు దక్కకుండా చేశారని ఓ సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది. ⍟ హైదరాబాద్ ఎన్‌కౌంటర్‌పై సిట్: దిశ హత్యాచార కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. రాచకొండ సీపీ మహేశ్ భగవత్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో సిట్‌ను ఏర్పాటు చేసింది. ఎన్‌కౌంటర్‌పై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ఆదేశించింది. ‌ ⍟ కామారెడ్డి రోడ్డు ప్రమాదం: కామారెడ్డి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం సంభవించింది. బిక్కనూరు మండలం జంగంపల్లి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వేగంగా వచ్చిన కారు ఓ చెట్టును ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది.


By December 09, 2019 at 08:45AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/telugu-top-trending-andhra-telangana-national-news-headlines-on-9th-december-2019/articleshow/72432680.cms

No comments