Breaking News

Balakrishna: బాలకృష్ణకు జోడిగా బాలీవుడ్ బ్యూటీ!


ప్రస్తుతం రూలర్‌ సినిమా పనుల్లో బిజీగా ఉన్న నందమూరి బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని కూడా ఇప్పటికే ప్రారంభించిన సంగతి తెలిసిందే. తనతో రెండు సూపర్‌ హిట్ సినిమాలను తెరకెక్కించిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో నెక్ట్స్ సినిమా చేస్తున్నాడు బాలకృష్ణ. ఇప్పటికే లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ప్రస్తుతం బోయపాటి సినిమాకు సంబంధించి నటీనటుల ఎంపిక కూడా జరుగుతోంది. ముందుగా ఈ సినిమాలో బాలకృష్ణకు జోడిగా మహానటి ఫేం కీర్తి సురేష్‌ను తీసుకోవాలని భావించారు. కానీ కీర్తి ఇప్పటికే కమిట్‌ అయిన ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండటంతో బాలయ్య సినిమాకు నో చెప్పింది. దీంతో మరో హీరోయిన్‌ను వెతికే పనిలో ఉన్నారు చిత్రయూనిట్‌. Also Read: తాజాగా ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా ఓ బాలీవుడ్‌ హీరోయిన్‌ నటించనుందన్న టాక్‌ వినిపిస్తోంది. స్టార్‌ వారసురిలిగా వెండితెరకు పరిచయం అయిన బాలీవుడ్‌ భామ సోనాక్షి సిన్హా, బోయపాటి సినిమాలో హీరోయిన్‌గా నటించనుందన్న టాక్‌ వినిపిస్తోంది. గతంలో రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కిన లింగ సినిమాలో నటించిన సోనాక్షి మరోసారి సౌత్‌ సినిమాలో నటించేందుకు అంగీకరించిందన్న టాక్‌ వినిపిస్తోంది. మిరియాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాను దాదాపు 70 కోట్ల బడ్జెట్‌తో రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కిన గత చిత్రాలు సింహా, లెజెండ్‌ బ్లా్క్‌ బస్టర్‌ సక్సెస్‌లు కావటంతో ఈ సినిమా అంతుక మించి ఉంటుందన్న అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల వినయ విధేయ రామ సినిమాతో నిరాశపరిచిన బోయపాటి, బాలకృష్ణ సినిమాతో తిరిగి ఫాంలోకి రావాలని ప్లాన్ చేస్తున్నాడు. Also Read:


By December 15, 2019 at 09:23AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/sonakshi-sinha-roped-in-for-balakrishna-boyapati-srinus-film/articleshow/72655679.cms

No comments