Breaking News

సమయం లైవ్ న్యూస్: రాజధానిపై మళ్లీ మాట మార్చిన బొత్స.. ఉల్లి అమ్మిన రోజా


⍟ అమరావతిపై మళ్లీ మాట మార్చిన బొత్స: రాజధాని అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి గందరగోళ వ్యాఖ్యలు చేశారు. రాజధానిగా అమరావతే ఉంటుందని అసెంబ్లీలో చెప్పిన మర్నాడే మాట మార్చారు. ప్రభుత్వం వేసిన నిపుణుల కమిటీ నివేదిక తర్వాతే రాజధానిపై స్పష్టత వస్తుందని వ్యాఖ్యానించారు. రాజధాని అమరావతేనని, మార్చే ప్రతిపాదన లేదని శుక్రవారం మండలిలో ప్రకటించిన మంత్రి, శనివారం మరోలా వ్యాఖ్యలు చేయడం విశేషం. ⍟ శబరిమలకు మహిళలు వెళ్తొద్దు: జేసుదాసు శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలన్న గతేడాది సెప్టెంబరులో సుప్రీంకోర్టు ఇచ్చి తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్లు దాఖలు కావడంతో ఈ ఏడాది మాత్రం మహిళలను ఆలయంలోకి అనుమతించలేదు. ఈ నేపథ్యంలో మహిళల ప్రవేశంపై ప్రముఖ గాయకుడు, అయ్యప్ప భక్తుడు కేజే ఏసుదాసు స్పందించారు. ఆయేషా మీరా హత్య కేసు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. హత్య జరిగిన రోజు నుంచి నేటి వరకు ఎన్నో మలుపులు తిరుగుతూ వస్తున్న ఈ కేసులో దోషి ఎవరనేది ఇప్పటికీ తేలలేదు. దీంతో ఈ కేసు సీబీఐకి అప్పగించారు. అయితే, ఈ కేసుకు సంబంధించిన ఆధారాల రికార్డులు విజయవాడ కోర్టులో ధ్వంసం కావడంతో.. తిరిగి వాటిని సేకరించడం సీబీఐకి సవాల్‌గా మారింది. దీంతో రీ-పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఏపీఐఐసీ ఛైర్మన్, ఎమ్మెల్యే రోజా ఉల్లిపాయలు అమ్మారు. తన సొంత నియోజకవర్గంలోని పుత్తూరు మార్కెట్ యార్డ్‌లో ప్రభుత్వం సబ్సిడీ కింద అందిస్తున్న ఉల్లి విక్రయాలను పరిశీలించారు. ఉల్లి పంపిణీని పరిశీలించడానికి వచ్చిన ఆమె మహిళలను పలకరించారు.. ఏవైనా సమస్యలు ఉన్నాయా అంటూ ఆరా తీశారు..


By December 15, 2019 at 09:00AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/telugu-top-trending-andhra-telangana-national-news-headlines-on-15th-december-2019/articleshow/72654282.cms

No comments