Breaking News

కృష్ణా జిల్లాలో 53ఏళ్ల మహిళపై అత్యాచారం


తెలుగు రాష్ట్రాల్లో మహిళలపై అత్యాచారాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఓ వైపు ప్రజలు రోడ్డెక్కి కామాంధులను ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నా అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా కృష్ణా జిల్లాలో 53ఏళ్ల మహిళపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. Also Read: మొవ్వ మండలం కూచిపూడి యద్దనపూడి పంచాయతీ పరిధిలో నివసించే ఓ మహిళ(53) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో ఇంట్లో ఉండగా ఓ వ్యక్తి తనను కొట్టి చేసి పారిపోయాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై ఆదివారం పోలీసులు కేసు నమోదు చేయగా.. చల్లపల్లి సీఐ ఎన్‌.వెంకటనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. Also Read: ఈ ఘటన యద్దనపూడి గ్రామంలో కలకలం రేపింది. మహిళ ఒంటరిగా ఉంటున్న విషయం తెలుసుకున్న దుండగుడు పక్కా పథకం ప్రకారమే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామస్థులు భయభ్రాంతులకు గురవుతున్నారు. Also Read:


By December 02, 2019 at 08:55AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/53-yr-old-woman-raped-in-krishna-district-case-booked/articleshow/72325286.cms

No comments