సమయం లైవ్ న్యూస్: అటెండర్ చంద్రయ్య మృతి.. శంషాబాద్ బాధితురాలి పేరు మార్పు

- సీఐ వేధింపులు భరించలేక తాను పనిచేస్తున్న పోలీస్ స్టేషన్ ముందే ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఏఎస్సై నర్సింహ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నవంబరు 22న బాలాపూర్ పోలీస్‌స్టేషన్ వద్ద పెట్రోలుపోసుకుని నిప్పంటించుకున్న నర్సింహ 40 శాతం కాలినగాయాలతో డీఆర్డీవో అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ సోమవారం తెల్లవారుజామున కన్నుమూశాడు.
- ఎమ్మార్వో విజయారెడ్డి హత్య కేసులో మరో విషాదం. 28 రోజులుగా ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న అటెండర్ చంద్రయ్య మృతి. ఆదివారం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన చెందగా, 24 గంటలు గడిస్తే కానీ పరిస్థితి చెప్పలేమని వైద్యులు తెలిపారు. చంద్రయ్య ప్రాణాలను కాపాడటానికి వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో సోమవారం ఉదయం ఆయన కన్నుమూశాడు..
- డిసెంబర్ 1న ఆర్టీసీ కార్మికులతో భేటీ అయిన సీఎం కేసీఆర్. ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపే చర్యలకు శ్రీకారం చుట్టారు. సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికులంతా సెల్ఫ్ డిస్మిస్ అయ్యారని గతంలో వ్యాఖ్యానించిన కేసీఆర్.. ఒక్కరి ఉద్యోగం కూడా పోదని తాజాగా భరోసా ఇచ్చారు. నూరుశాతం ఉద్యోగ భద్రత కల్పిస్తామని ప్రకటించారు.
- శంషాబాద్ బాధితురాలి పేరును ఇక మీదట ‘దిశ’ అని పిలవాలని తెలంగాణ పోలీసులు సూచించారు. ఇందుకు సంబంధించి పోలీసులు అధికారికంగా పేరును మీడియాకు విడుదల చేశారు. నిర్భయ చట్టంలో బాధితురాలి పేరుతో పాటు.. కుటుంబ సభ్యుల వివరాలను బయట పెట్టవద్దని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శంషాబాద్ బాధితురాలి పేరును కూడా మార్చాలని నిర్ణయించారు.
By December 02, 2019 at 08:47AM
No comments