Breaking News

సరికొత్త పథకం.. పెళ్లి చేసుకుంటే తులం బంగారం


పెళ్లి చేసుకుంటే తులం బంగారమా అని ఆశ్చర్యపోకండి.. మీరు వింటున్నది నిజమే. తీసుకొచ్చిన ఈ సరికొత్త పథకం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆడపిల్లలందరూ చదువుకునేలా ప్రోత్సహం అందించే దిశగా ఈ నిర్ణయం తీసుకుంది. పెళ్లి చేసుకోబోయే ప్రతి వధువుకు 10 గ్రాముల బంగారం కానుకగా అందించనుంది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ కొత్త పథకం ద్వారా మహిళా సాధికారత, బాల్యవివాహాలకు అడ్డుకట్ట వేయొచ్చంటోంది ప్రభుత్వం. అరుంధతి బంగారు పథకం పేరు మీద వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభిచేందుకు సిద్ధమవుతోంది. ఈ పథకం కోసం ఏడాదికి రూ.800 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ప్రభుత్వం చెబుతోంది. వధువు పేరు మీద ఉండే అకౌంట్‌లో ప్రభుత్వం రూ. 30 వేలు అకౌంట్‌లో డిపాజిట్ చేస్తుంది. అలాగే తప్పనిసరిగా వివాహాన్ని రిజస్టర్ చేసుకొని ఉండాలి. రాష్ట్రంలో ఏడాదికి మూడు లక్షల వరకు పెళ్లిళ్లు జరుగుతున్నాయని.. వాటిలో 50వేల నుంచి 60వేల వరకే రిజస్టర్ అవుతున్నాయంటోంది ప్రభుత్వం. ఇక ఆ సంఖ్య 2 లక్షల నుంచి 2.5 లక్షల వరకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ పథకానికి కొన్ని నిబంధనలు కూడా వర్తిస్తాయి. వధువు వివాహ వయస్సు 18.. వరుడి వయస్సు 21 ఉండాలి. వధువు కనీసం 10వ తరగతి చదువుకోవాలి. వధువు తండ్రి లేదా తల్లి ఆదాయం రూ.5లక్షల కంటే తక్కువ ఉండాలి. మొదటి వివాహానికే మాత్రమే పథకం వర్తిస్తుంది. టీ గార్డెన్, ఆదివాసీ గిరిజనులకు విద్యార్హత వర్తించదు.. ప్రభుత్వం వారికి ఈ నిబంధనను సడలించింది.


By November 21, 2019 at 10:43AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/arundhati-scheme-assam-govt-to-give-rs-30000-for-every-bride-to-buy-gold/articleshow/72154136.cms

No comments