Breaking News

భర్తకు విషమిచ్చిన కేసులో కొత్త ట్విస్ట్.. పోలీసులకు షాకింగ్ విషయాలు చెప్పిన బంధువులు


జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో పెళ్లయిన వారం రోజులకే నవవధువు భర్తకు విషం పెట్టి చంపాలని చూసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ యువతి పెళ్లి ఇష్టంలేకు మజ్జిగలో విషం కలిపి భర్తకు ఇచ్చిందని, మజ్జిగ తాగిన తర్వాత అనుమానం వచ్చిన భర్త వెంటనే ఆస్పత్రికి వెళ్లడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడని ఇప్పటివరకు అనుకున్నారు. అయితే ఈ కేసులో తాజాగా మరో కోణం వెలుగులోకి వచ్చింది. అందరూ అనుకుంటున్నట్లు ఇది యువతి ప్లాన్ కాదు.. భర్త లింగమయ్యే నాటకమాడినట్లు వధువు బంధువులు ఆరోపిస్తున్నారు. మజ్జిగలో నవవధువు పురుగుల మందు నిజంగానే కలిపితే.. భర్తతో పాటే ఆసుపత్రికి ఎందుకు పరుగులు తీస్తుంది? నిజంగా చంపే ఉద్దేశం ఉంటే మజ్జిగలోనే ఎందుకు విషం కలుపుతుంది? అంటూ అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు. దీంతో కొత్త పెళ్లికొడుకే వివాహబంధం నుంచి బయటపడేందుకు ఈ నాటకం ఆడాడన్న అనుమానాలు వస్తున్నాయి. Also Read: కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామానికి చెందిన లింగమయ్యకు.. నవంబర్ 11న మద్దికెర మండలం మందనంతపురానికి చెందిన నాగమణితో వివాహమైంది. వారం రోజుల తర్వాత భార్యతో కలిసి ఆమె పుట్టింటికి వెళ్లాడు లింగమయ్య.. అదే రోజు సాయంత్రం తన భార్య మజ్జిగలో విషం కలిపి ఇచ్చిందంటూ లింగమయ్య అనంతపురం ఆసుపత్రిలో చేరాడు. ఈ విషయం బయటికి పొక్కడంతో మీడియాలో ఈ వార్త సంచలనంగా మారింది. అందుకు కారణం లింగమయ్య చెప్పిన కారణం. పెళ్లి ఇష్టం లేనందువల్ల భార్య మజ్జిగలో పురుగుల మందు కలిపి ఇచ్చిందని చెప్పడంతో అందరూ ఆమెను తిట్టిపోశారు. Also Read: అయితే నాగమణి కుటుంబ సభ్యుల వాదన మరోలా ఉంది. నాగమణి సగం మజ్జిగ తాను తాగిన తర్వాతే భర్తకు ఇచ్చిందని, అలాంటప్పుడు ఆమె ఎందుకు అనారోగ్యానికి గురికాలేదని ఆమె తరపు బంధువులు ప్రశ్నిస్తున్నారు. పెళ్లైనప్పటి నుంచి ముభావంగా ఉంటున్న లింగమయ్య భార్యతో కాపురం చేయడం ఇష్టంలేకే నాటకమాడుతున్నాడని ఆరోపిస్తున్నారు. తమ బిడ్డ జీవితాన్ని నాశనం చేసిన లింగమయ్యను వదిలిపెట్టబోమని, అతడికి శిక్ష పడేలా చేస్తామని అంటున్నారు. Also Read:


By November 21, 2019 at 10:40AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/bride-giving-husband-poison-case-relatives-reveal-new-twist/articleshow/72154141.cms

No comments