కోరిక తీర్చాలంటూ సేల్స్‌గర్ల్‌కు వేధింపులు.. ఒప్పుకోలేదని బ్లేడ్‌తో
కుటుంబ పోషణ నిమిత్తం ఓ బట్టల దుకాణంలో పనిచేస్తున్న వివాహిత ఓ కామాంధుడి కారణంగా ఆపదలో పడింది. కోరిక తీర్చాలంటూ వెంటపడుతున్నారు తనను పట్టించుకోకపోవడంతో ఆ దుర్మార్గుదు మహిళపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. జిల్లా మండలం కేంద్రంలో బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటన తాలూకు వివరాలిలా ఉన్నాయి. Also Read: రాయవరానికి చెందిన ఓ వివాహిత కుటుంబ పోషణ కోసం స్థానికంగా ఓ బట్టల దుకాణంలో రెండేళ్లుగా పనిచేస్తోంది. రోజూ పనికి వెళ్లొచ్చే సమయంలో ఆమెను పెయింటింగ్ పనులు చేసే చంద్రమళ్ల సుబ్బారావు అనే వ్యక్తి వేధిస్తున్నాడు. తన కోరిక తీర్చాలని, అక్రమ సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి చేస్తున్నాడు. ఈ విషయాన్ని బాధితురాలు పెద్దల దృష్టికి తీసుకెళ్లడంతో అందరూ అతడిని మందలించారు. Also Read: దీంతో కక్ష పెట్టుకున్న సుబ్బారావు బుధవారం షాపు నుంచి ఇంటికి వెళ్తున్న ఆమెపై బ్లేడ్‌తో దాడికి పాల్పడ్డాడు. ఆ కామాంధుడి బారి నుంచి తప్పించుకునే క్రమంలో మహిళ మెడ, చేతులపై తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలి కేకలు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని సుబ్బారావును చితకబాది పోలీసులకు అప్పగించారు. మహిళకు తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. Also Read:
By November 21, 2019 at 11:03AM
No comments