రాజేంద్రనగర్‌లో మహిళ కిడ్నాప్ కలకలం?.. పరుగులు పెట్టిన పోలీసులు

వరుస నేరాలతో హైదరాబాద్ ప్రజలు ఉలిక్కి పడుతున్నారు. రెండ్రోజుల క్రితం నగర శివారులో వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్యాచారం ఘటన మరువకముందే శంషాబాద్ సమీపంలో ఓ మహిళను దుండగులు చంపేసి దహనం చేశారు. ఈ ఘటనలతో పోలీసులు తలలు పట్టుకుంటున్న సమయంలోనే శుక్రవారం రాత్రి నగర శివారు రాజేంద్రనగర్ సమీపంలో మహిళ కిడ్నాప్ కలకలం రేపింది. Also Read: రాజేంద్రనగర్‌లో శుక్రవారం రాత్రి కొందరు దుండగులు మహిళను కారులో బలవంతంగా ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఈ ఘటనను చూసిన స్థానికులు వెంటనే 100 నంబర్‌కు ఫోన్ చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆరాంఘర్, శంషాబాద్ వైపు వెళ్లే వాహనాలను తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఓమ్నీ వ్యానులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. Also Read: అయితే ఓమ్నీ వ్యానులో మహిళ ఎవరూ లేకపోవడంతో పోలీసులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు మహిళ కిడ్నాప్ జరిగిందా? లేక 100కి ఫోన్ చేసిన వారు పొరపడ్డారా? అన్న కోణంలో విచారిస్తున్నారు. లేక పోలీసులు వెంటపడుతున్నారని భయపడి మహిళను ఎక్కడైనా దాచారా? అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. డయల్ 100కి ఫోన్ చేసిన ఆటోడ్రైవర్‌ను కూడా పోలీసులు విచారిస్తున్నారు. అయితే అతడు తాను పొరపాటుగా పోలీసులకు ఫోన్ చేసినట్లు విచారణలో చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి ఏ వివరాలు పోలీసులు స్పష్టం చేయడం లేదు. Also Read:
By November 30, 2019 at 08:44AM
No comments