Breaking News

ప్రియాంకరెడ్డి శవాన్నీ వదలని కామాంధులు.. చనిపోయాక కూడా అనేకసార్లు అత్యాచారం


హైదరాబాద్‌ నగర శివారు శంషాబాద్‌లో వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డిపై అఘాయిత్యం కేసులో అనేక కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రియాంకపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన చంపేసిన తర్వాత కూడా ఆ కామాంధులు మృతదేహంపైనా అనేకసార్లు అఘాయిత్యానికి పాల్పడినట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది. దీంతో ఆమె కుటుంబసభ్యులతో పాటు పోలీసులు దిగ్భ్రాంతి చెందారు. Also Read: ప్రియాంకపై 30-45 నిమిషాల పాటు అత్యాచారం చేసి చంపేసిన కామాంధులు ఆమె మృతదేహాన్ని లారీ క్యాబిన్‌లోకి ఎక్కించారు. ఆ సమయంలో మృతదేహానికి ప్యాంటు లేదు. లారీలో ప్రయాణిస్తున్న సమయంలోనే ఆ కామాంధులు ప్రియాంక మృతదేహంపై అనేకసార్లు అత్యాచారం చేశారు. ఆ తర్వాత నిందితుల్లో ఒకరు ప్యాంటు తొడిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఘటనాస్థలంలో పోలీసులు మృతురాలి లోదుస్తులు, పర్సు, చెప్పులు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు నిందితుల్లో ఓ మైనర్ ఉన్నట్లు ముందుగా ప్రచారం జరిగినా.. అందరూ 20ఏళ్లకు పైబడిన వారేనని పోలీసులు స్పష్టం చేయడంతో ఆ ప్రచారానికి తెరపడింది. Also Read: మద్యం తాగించి మరీ అఘాయిత్యం ప్రియాంకరెడ్డికి దుండగులు బలవంతంగా మద్యం తాగించి కిరాతకానికి పాల్పడ్డారు. బాధితురాలు తన స్కూటీ కోసం వేచిచూస్తున్న ప్రదేశం నుంచి మహ్మద్‌ ఆరీఫ్‌, చెన్నకేశవులు, నవీన్‌లు ఆమెను బలవంతంగా నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లారు. ఆ సమయంలో బాధితురాలు ‘హెల్ప్‌.. హెల్ప్‌..’ అని అరిచినా వాహనాల రాకపోకల శబ్దం కారణంగా ఎవరికీ వినిపించలేదు. తర్వాత దుండగులు ఆమె నోరు నొక్కి లాక్కెళ్లారు. కొంతసేపటికి స్కూటీ తీసుకొచ్చిన శివ వారితో కలిసి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటిస్తుండటంతో మద్యం తాగించి ఆ మత్తులో అఘాయిత్యానికి పాల్పడ్డారు. కాసేపటికి బాధితురాలు అపస్మారక స్థితికి చేరుకోవడంతో నోరు, ముక్కు మూసేసి ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీశారు. Also Read:


By November 30, 2019 at 09:05AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/4-men-also-raped-on-priyanka-reddy-dead-body-revealed-postmortem-report/articleshow/72302645.cms

No comments