Breaking News

YS Jagan నిర్ణయానికి కన్నా ఫిదా.. ‘భరోసా’ బాగుందన్న బీజేేపీ నేత!


ఏపీ సీఎం నెల్లూరులో ‘రైతు భరోసా’ పథకాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా ప్రతి రైతు కుటుంబానికి రూ.13500 చొప్పున పెట్టుబడి సాయం అందజేయనున్నారు. ఐదేళ్లపాటు ఈ సాయాన్ని కొనసాగిస్తామని వైఎస్ఆర్సీపీ సర్కారు ప్రకటించింది. కౌలురైతులకు కూడా రైతు భరోసా లభించనుంది. ఈ పథకం పేరు విషయంలో గతంలో జగన్‌పై విమర్శలు గుప్పించిన కన్నా.. తాజాగా ఏపీ సీఎంపై ప్రశంసలు గుప్పించారు. ఈ పథకానికి జగన్ సర్కారు మొదట ‘వైఎస్ఆర్ రైతుభరోసా’గా నామకరణం చేసింది. కేంద్రం రూ.6 వేలు ఇస్తుండటంతో.. దానికి ప్రధాని పేరు పెట్టాలని కన్నా డిమాండ్ చేశారు. గతంలో బాబును స్టిక్కర్ సీఎంగా విమర్శించిన బీజేపీ నేత.. ఇప్పుడు జగన్ కూడా అలాగే చేస్తున్నారన్నారు. దీంతో జగన్ ఈ పథకానికి వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్‌గా మార్చారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కన్నా స్వాగతించారు. ‘‘మోదీ గారు రైతులకు అందించే కేంద్ర నిధులు రూ.6000 కు రాష్ట్రం మ్యాచింగ్ గ్రాంట్ కలిపి "YSR రైతు భరోసా-PM కిసాన్"గా ఇవ్వడం హర్షణీయం.. గత సర్కారులా కాక ఇకపై కేంద్రం నిధులతో ఇచ్చే వివిధ సంక్షేమ పథకాలకు ప్రధానమంత్రి పేరు తప్పనిసరిగా జత చేసి లబ్ధిదారులకు అందచేయాలి’’ అని కన్నా ట్వీట్ చేశారు.


By October 15, 2019 at 12:16PM


Read More https://telugu.samayam.com/andhra-pradesh/news/bjp-leader-kanna-lakshminarayana-welcomes-ys-jagan-decision-on-rythu-bharosa/articleshow/71593179.cms

No comments