పూరి జగన్నాథ్ సినిమా సెట్‌లో అగ్ని ప్రమాదం

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ నిర్మిస్తున్న సినిమా సెట్స్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. పూరి తనయుడు హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అనిల్ పాడూరిని దర్శకుడిగా పరిచయం చేస్తూ పూరి జగన్నాథ్, చార్మీలు నిర్మిస్తున్న ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్‌కు సంబంధంచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సెట్‌లో ఏర్పాటు చేసిన కర్టన్‌లకు మంటలు అంటుకోవటంతో అవి వేగంగా వ్యాపించాయి. అయితే అక్కడే ఉన్న సెట్ సిబ్బంది వెంటనే స్పందించిన మంటలను ఆర్పివేయటం భారీ ప్రమాదం తప్పింది. సెట్ పాక్షికంగా దెబ్బతినటంతో షూటింగ్‌కు అంతరాయం ఏర్పడింది. Also Read: ఆంధ్రాపోరి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆకాష్ తరువాత పూరీ దర్శకత్వంలో మెహబూబా సినిమాలో నటించాడు. అయితే ఈ రెండు సినిమాలకు ఆకాశ్‌కు ఆశించిన స్థాయి విజయాన్ని అందించలేకపోయాయి. అందుకే రొమాంటిక్ సినిమా విషయంలో పూరి అండ్ టీం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సినిమాతో ఆకాష్‌కు హీరోగా తొలి సక్సెస్ అందించాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు మంచి రెస్సాన్స్ వచ్చింది. బోల్డ్ స్టిల్‌తో ఆకట్టుకున్న చిత్రయూనిట్ సినిమా కంటెంట్ ఎలా ఉండబోతోందో హింట్ ఇచ్చారు. దీంతో రొమాంటిక్ మూవీపై యూత్‌లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఇస్మార్ శంకర్ సక్సెస్‌తో పూరి కూడా మంచి ఫాంలో ఉన్నాడు. రొమాంటిక్‌ను సక్సెస్ చేసి నిర్మాతగానూ తన ఫాం నిరూపించుకునే ఆలోచనలో ఉన్నాడు పూరి. Also Read:
By October 15, 2019 at 11:44AM
No comments