Breaking News

Texas: కూతురి ఫ్రెండ్‌ని డ్రగ్స్ బానిసగా మార్చి లైంగిక దోపిడీ


కామంతో కళ్లుమూసుకుపోయిన ఓ వ్యక్తి కూతురి స్నేహితురాలిని లైంగికంగా దోచుకుని గర్భవతిని చేసిన ఘటన అమెరికాలోని టెక్సాస్‌లో వెలుగుచూసింది. 12వ తరగతి చదివే బ్రాండ్లీ అనే యువతి తండ్రి రాబర్ట్‌తో కలిసి టెక్సాస్‌లో నివసిస్తోంది. ఆమెకు అత్యంత సన్నిహితురాలైన జోలోవిచ్ అనే యువతి తరుచూ బ్రాండ్లీ ఇంటికి వెళ్తుండేది. ఈ క్రమంలో ఆమెపై రాబర్ట్ కన్నేశాడు. జోలోవిచ్‌తో సన్నిహితంగా మెలుగుతూ ఆమెకు డ్రగ్స్ అలవాటు చేశాడు. Also Read: డ్రగ్స్‌కు పూర్తిగా బానిసైన జోలోవిచ్‌ను రాబర్ట్ లైంగికంగా దోచుకునేవాడు. డ్రగ్స్ కావాలంటే తనతో గడపాలని ఒత్తిడి చేయడంతో ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. దీంతో బ్రాండ్లీ ఇంట్లో లేని సమయంలో జోలోవిచ్‌ను ఇంటికి పిలిచి అత్యాచారం చేసేవాడు. ఓ రోజు బయటి నుంచి ఇంటికి వచ్చిన బ్రాండ్లీకి జోలోవిచ్ చెప్పులు కనిపించాయి. తనకు చెప్పకుండా స్నేహితురాలు ఎందుకు వచ్చిందా అని ఆమె అనుమానించింది. తండ్రి బెడ్‌రూమ్‌లోకి వెళ్లి చూడగా ఇద్దరూ రాసలీలల్లో మునిగి తేలుతున్నారు. Also Read: దీంతో బ్రాండ్లీ వెంటనే తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అమెరికాలో మైనర్లతో సెక్స్ చేయడంతో చట్టరీత్యా నేరం. దీంతో పోలీసులు రాబర్ట్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. జోలోవిచ్‌ వాంగ్మూలం ఆధారంగా అతడిపై లైంగిక వేధింపులు, అత్యాచారం, డ్రగ్స్ వినియోగం వంటి కేసులు నమోదు చేశారు. డ్రగ్స్ బారి నుంచి జోలోవిచ్‌ను కాపాడేందుకు రిహాబిలేషన్ సెంటర్‌కు తరలించారు. వైద్య పరీక్షల్లో బాధితురాలు గర్భవతి అని తేలడంతో అందరూ దిగ్భ్రాంతి చెందారు. Also Read:


By October 27, 2019 at 11:54AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/us-man-arrested-for-sexual-affair-with-daughters-friend/articleshow/71783293.cms

No comments