భార్యకు విడాకులిచ్చి కన్నకూతురిపైనే లైంగిక వేధింపులు

కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న కూతురిపైనే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడో కామాంధుడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్యతో విడాకులు తీసుకున్నాడు. కోర్టు తీర్పు ప్రకారం వారి 16ఏళ్ల కుమార్తె తండ్రి వద్ద ఉంటోంది. Also Read: అయితే తండ్రి తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని, కోరిక తీర్చాలంటూ వేధిస్తున్నాడని బాలిక మీరట్ ఏఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం సంవత్సరం నుంచి తన తండ్రితో ఉంటున్నానని, తండ్రి వేధింపులు భరించలేకే పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేస్తున్నట్లు బాలిక చెప్పింది. Also Read: లైంగిక వేధింపులపై గతంలో రైల్వేరోడ్ పోలీస్‌స్టేషన్‌లో చాలాసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, అందుకే ఏఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు బాలిక తెలిపింది. తండ్రిపై చర్యలు తీసుకుని తనకు రక్షించాలని బాలిక ఏఎస్పీకి లేఖ రాసింది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. Also Read:
By October 27, 2019 at 12:14PM
No comments