Breaking News

భార్యను వేధిస్తూ మరో యువతికి పెళ్లి ప్రపోజల్.. నో చెప్పిందని కత్తితో దాడి


జిల్లాలో ప్రేమోన్మాదం బుసలు కొట్టింది. ప్రేమ పేరుతో యువతిని వేధిస్తున్న ఓ ఉన్మాది ఆమెపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. తన ప్రేమను తిరస్కరించిందన్న ఆక్రోశంతో ఆమె ప్రాణాలనే తీయాలనుకున్నాడు. అనంతరం విషం తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ప్రస్తుతం ఆ ఇద్దరూ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. Also Read: పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం కవిటం గ్రామానికి చెందిన సుధాకర్‌ గతంలో పెళ్లయింది. భార్యను వేధిస్తున్న అతడు ఆమెతో విడిపోయేందుకు విడాకుల కోసం ప్రయత్నిస్తున్నాడు. అంతటితో ఆగకుండా అదే గ్రామానికి చెందిన తేజస్విని అనే యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. భార్యకు విడాకులిచ్చేసి రెండో పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఆమె తిరస్కరిస్తూ వస్తోంది.. దీంతో సుధాకర్ ఆమెపై కక్ష పెంచుకున్నాడు. తనకు దక్కనికి ఎవరికీ దక్కకూడదని నిర్ణయించుకున్నాడు. Also Read: ఎమ్మెస్సీ చదువుతున్న తేజస్విని బుధవారం ఉదయం కాలేజీకి వెళ్లేందుకు బస్సు కోసం ఎదురుచూస్తోంది. అదే సమయంలో అక్కడే మాటువేసిన సుధాకర్ ఒక్కసారిగా ఆమెపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. రక్తపు మడుగులో పడివున్న తేజస్వినిని స్థానికులు హుటాహుటిన పాలకొల్లు ఆస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడిన సుధాకర్ విషం తాగి ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో అతడిని కూడా అదే ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సుధాకర్ కొద్ది నెలలుగా ప్రేమ, పెళ్లి పేరుతో వేధిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ విషయం తల్లిదండ్రులకు చెబితే కాలేజీ మాన్పించేస్తారేమోనన్న భయంతో మౌనంగా ఉండిపోయిందని తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకుని సమగ్ర దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. Also Read:


By October 16, 2019 at 11:45AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/west-godavari-man-stabs-young-woman-over-she-refuses-his-marriage-proposal/articleshow/71609593.cms

No comments