రూ.100ల కోసం నిలదీసిన భర్త.. ఎలుకల మందు తిని భార్య ఆత్మహత్య

అన్యోన్యంగా సాగుతున్న కాపురంలో డబ్బు చిచ్చు పెట్టింది. రూ.100ల కోసం భర్త నిలదీయడంతో భార్య మనస్తాపానికి గురై చేసుకుంది. తల్లి మృతిలో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. క్షణికావేశంలో ఆమె తీసుకున్న నిర్ణయంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. Also Read: జిల్లా మాచవరం మండలం పిల్లుట్ల గ్రామానికి చెందిన రాజాసాహెబ్, సైదాబీలు భవన నిర్మాణ కూలీలుగా పనిచేస్తున్నారు. తమ ప్రాంతంలో పనులు లేకపోవడంతో గుంటూరు నగరానికి వలస వచ్చి జీవిస్తున్నారు. వారి కుమార్తె నాగుల్‌బీని బంధువుల అబ్బాయి అయిన రైతు బజార్‌లో పనిచేసే మస్తాన్‌వలికి ఇచ్చి ఆరేళ్ల క్రితం పెళ్లి చేశారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు సంతానం. Also Read: శనివారం(అక్టోబర్ 12) మస్తాన్ వలి కూలి డబ్బులు తెచ్చి భార్యకు ఇచ్చి దాచమన్నాడు. కాసేపటి తర్వాత ఆ డబ్బులు తీసుకుని లెక్కపెట్టగా రూ.100 తక్కువగా ఉన్నాయి. దీంతో వంద రూపాయిలు ఎందుకు తీశావంటూ నాగుల్‌బీని నిలదీశాడు. తాను అందులో నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని ఆమె చెప్పినా వినకుండా దుర్భాషలాడాడు. దీంతో దంపతుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కాసేపటి తర్వాత ఇద్దరు సర్దుకుపోవడంతో గొడవ సద్దుమణిగింది. Also Read: అయితే భర్త తనను అకారణంగా తిట్టాడని మనస్తాపం చెందిన నాగుల్‌బీ ఆదివారం ఉదయం ఎలుకల మందు తినేసింది. ఈ విషయం గమనించిన మస్తాన్‌వలి ఆమెను వెంటనే గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం ప్రాణాలు కోల్పోయింది. నాగుల్‌బీ తల్లిదండ్రుల ఫిర్యాదుతో గుంటూరు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. Also Read:
By October 14, 2019 at 10:22AM
No comments