Nellore: గిరిజన మహిళను అడ్డగించి ముగ్గురి గ్యాంగ్ రేప్

ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెస్తున్నా, న్యాయస్థానాలు ఎన్ని కఠినశిక్షలు విధిస్తున్నా కామాంధుల ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. నిత్యం ఎక్కడో చోట కీచకుల చేతితో అబలల జీవితాలు నాశనమవుతూనే ఉన్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లాలో గిరిజన మహిళపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. Also Read: నెల్లూరు గ్రామీణ మండలానికి చెందిన ఓ మహిళ శుక్రవారం రాత్రి భర్తతో కలిసి సమీప గ్రామానికి వెళ్లింది. అక్కడ ఆమె భర్త పుల్లుగా మద్యం తాగి గొడవపడ్డాడు. దీంతో మనస్తాపం చెందిన మహిళ రాత్రివేళ ఒంటరిగానే ఇంటికి నడుచుకుంటూ బయలుదేరింది. కొంత దూరం వెళ్లాక బైక్‌పై వచ్చిన ముగ్గురు ఆమెను అడ్డగించి వేధించారు. తనను వదిలేయాలని బాధితురాలు వేడుకున్నా కనికరించకుండా సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. Also Read: అపస్మాకర స్థితిలోకి వెళ్లిన ఆమెను దుండగులు అక్కడే వదిలేసి పారిపోయారు. శనివారం ఉదయం మెలకువ వచ్చిన బాధితురాలు ఇంటికి వెళ్లి బంధువుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులను పక్క గ్రామానికి చెందిన కురుగొండ్ల నరసయ్య, సక్కిరాల రవి, బండ్ల కామాక్షయ్యగా గుర్తించి అరెస్ట్ చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. Also Read:
By September 29, 2019 at 09:07AM
No comments