పదేళ్ల బాలికకు పోర్న్ వీడియోలు చూపిస్తూ లైంగిక వేధింపులు

పదేళ్ల బాలికకు పోర్న్ వీడియోలు చూపిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్న కామాంధుడిని స్థానికులు చితక్కొట్టిన ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో శనివారం జరిగింది. తెనాలిలోని చంద్రబాబు కాలనీలో నివాసముండే పసుపులేటి దుర్గాప్రసాద్‌కు 16ఏళ్ల క్రితం పెళ్లయింది. పిల్లలు పుట్టకపోవడంతో పాటు భర్త వేధింపులు తాళలేక అతడి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. Also Read: దుర్గాప్రసాద్ వెదురుబొంగులతో నిచ్చెనలు తయారుచేసి విక్రయిస్తూ ఉంటాడు. స్థానికులకు చిన్నమొత్తాలను వడ్డీకి ఇస్తుంటాడు. ఒంటరిగా ఉండే దుర్గాప్రసాద్ సెల్ఫోన్లో పోర్న్ వీడియోల వీక్షణకు బానిసగా మారిపోయాడు. ఏకాంతంగా ఉన్న సమయంలో అవి చూస్తూనే కాలం గడిపేవాడు. అక్కడితో ఆగకుండా కాలనీలో ఉండే బాలికలను ఇంట్లోకి పిలిచి పోర్న్ వీడియోలు చూపిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. Also Read: గతంలో ఓ బాలికను ఇలాగే వేధించడంతో స్థానికులు దేహశుద్ధి చేసి హెచ్చరించారు. శనివారం పక్కింటి బాలికను ఇంట్లోకి పిలిచిన దుర్గాప్రసాద్ ఆమెకు పోర్న్ వీడియోలు చూపించి బట్టలు విప్పేయాలని కోరాడు. దీంతో భయపడిపోయిన బాలిక ఇంటికి వెళ్లి తల్లికి విషయం చెప్పింది. దీంతో ఆమె స్థానికులతో కలిసి దుర్గాప్రసాద్ ఇంటికి చేరుకుని అతడిని చితక్కొట్టింది. అనంతరం పోలీసులకు అప్పగించింది. Also Read:
By September 29, 2019 at 08:47AM
No comments