Breaking News

కూతురిని వ్యభిచార ముఠాకు అమ్మేసిన కన్నతల్లి


కంటికి రెప్పలా కాపాడాల్సిన అమ్మే కూతురి జీవితాన్ని నాశనం చేసింది. రూ.లక్ష కోసం మైనర్ అయిన కూతురిని(15) వ్యభిచార ముఠాకు అమ్మేసింది. బాధితురాలు అక్కడి నుంచి తప్పించుకుని మహిళా కమిషన్‌‌ను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. Also Read: ఢిల్లీకి చెందిన ఓ మహిళ బంధువుల ఇంటికి వెళ్తున్నామని చెప్పి తన కూతురిని సెప్టెంబర్ 8వ తేదీన నిజాముద్దీన్‌లోని ఓ హోటల్‌కు తీసుకెళ్లింది. అక్కడ షాహిద్ అనే వ్యక్తికి అప్పగించింది. అతడితో వెళ్లాలని తల్లి చెప్పడంతో బాలిక సరేనని తలూపింది. షాహిద్ ఆ బాలికను సమీపంలోని భవానా గ్రామంలోని ఐశ్వర్ కాలనీలో తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ మరికొందరు బాలికలు కూడా ఉండటంతో బాధితురాలికి ఏమీ అర్ధం కాలేదు. ఆ బాలికలతో మాట్లాడుతుండగా తాను వ్యభిచార కూపంలో చిక్కుకున్నట్లు తెలుసుకుంది. ‘మీ అమ్మ నిన్ను రూ.లక్ష కోసం వ్యభిచార ముఠాకు అమ్మేసింది. ఆ డబ్బులు తిరిగిచ్చే వరకు వీరు నీ శరీరంతో వ్యాపారం చేస్తూనే ఉంటారు’ అని ఓ బాలిక చెప్పడంతో ఆమెకు అసలు విషయం అర్థమైంది. Also Read: దీంతో మరుసటి రోజే అక్కడి నుంచి చాకచక్యంగా తప్పించుకున్న బాధితురాలు స్థానికుల సాయంతో ఢిల్లీ మహిళా కమిషన్‌కు ఫోన్ చేసింది. దీంతో కమిషన్ సభ్యులు హుటాహుటిన ఆ గ్రామానికి చేరుకుని బాలికను రక్షించి స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆమె ఫిర్యాదుతో తల్లి, సవతి తండ్రితో పాటు షాహిద్, మరో వ్యక్తిపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:


By September 16, 2019 at 09:15AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/delhi-woman-sells-15-yr-old-daughter-for-rs-1-lakh-to-prostitution-gang/articleshow/71143829.cms

No comments