Breaking News

తల్లి కాళ్లు పట్టుకొని వేలాడినా.. ఆ పసిదాన్ని వరద గోదారి తనలోకి లాగేసుకుంది..


గోదావరిలో బోటు బోల్తా పడటంతో.. విహార యాత్రకు వెళ్లిన వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అప్పటి వరకు ప్రకృతి అందాలను తిలకిస్తూ.. సరదాగా గడిపిన వారంతా.. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో అక్కారంపల్లికి చెందిన సుబ్రహ్మణం ఆయన కుమార్తె హాసిని గల్లంతయ్యారు. తండ్రి అస్థికలను గోదావరిలో కలపడం కోసం భార్య మధులత, ఏడో తరగతి చదువుతోన్న కుమార్తెతో కలిసి సుబ్రహ్మణం పాపికొండలు ప్రాంతానికి వచ్చారు. కాగా దేవీపట్నం సమీపంలో బోటు బోల్తా పడటంతో.. సుబ్రహ్మణం, ఆయన కుమార్తె గల్లంతయ్యారు. మధులతను స్థానికులు కాపాడి మరో బోటులో రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులను పరామర్శించిందేందుకు మంత్రి కన్నబాబు వెళ్లగా.. తన బిడ్డను, భర్తను కోల్పోయిన తీరును తలుచుకొని మధులత గుండెలు అవిసేలా ఏడ్చింది. ‘‘పడవ బోల్తా పడిన వెంటనే నా కూతురు నా కాళ్లను పట్టుకుని వేలాడింది. అయినా నా బిడ్డను కాపాడుకోలేకపోయా. పడవ బోల్తా పడగానే.. మా ఆయన నీటిలో మునిగిపోతున్న హాసినిని, నన్ను పైకి నెట్టారు. తను లైఫ్ జాకెట్ అందించడంతో ప్రమాదం నుంచి నేను బయటపడ్డాను. కానీ బిడ్డను మాత్రం కాపాడుకోలేయా. కళ్ల ముందే మా ఆయన నీటిలో మునిగిపోయారు. పాప స్కూల్ పిల్లలతో కలిసి జూపార్క్‌కు వెళ్తానంది.. కానీ మేమే బలవంతంగా గోదావరికి తీసుకెళ్లి తప్పు చేశామ’’ని మధులత వాపోయింది.


By September 16, 2019 at 09:46AM


Read More https://telugu.samayam.com/andhra-pradesh/news/godavari-boat-capsize-father-and-daughter-from-tirupati-feared-dead-in-river/articleshow/71144134.cms

No comments