సన్నిహితుడే కీచకుడు.. ఫ్రెండ్‌తో కలిసి వివాహితపై గ్యాంగ్‌రేప్
భర్తకు దూరంగా ఉంటున్న మహిళతో సన్నిహితంగా మెలిగి మరో వ్యక్తితో సామూహిక అత్యాచారానికి గురైన ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబయిలో చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని సతర పట్టణానికి చెందిన ఓ మహిళ(25) విభేదాల కారణంగా భర్తకు దూరంగా ఉంటూ కుమార్తెతో కలిసి నివాసముంటోంది. ముంబయిలోని కలవాడని ప్రాంతంలో ఉంటున్న అక్క దగ్గరికి అప్పుడప్పుడు వస్తూ ఉండేది. Also Read: ఈ క్రమంలోనే సోదరి ఇంటి పక్కన ఉండే అంజద్ ఆలీ(30)తో ఆమెకు పరిచయం ఏర్పడింది. భర్త తోడు లేకపోవడంతో ఆ మహిళ ఆలీతో సన్నిహితంగా మెలిగేది. దీంతో అప్పుడప్పుడు ముంబయ్ వెళ్లి అతడితో సినిమాలు, షికార్లకు తిరిగేది. రోజూ ఇద్దరూ వీడియో కాల్‌లో మాట్లాడుకునేవారు. ఓ రోజు ఆలీ న్యూడ్ ఫోటోలు పంపాలని అడగడంతో ఆమె పంపించింది. Also Read: అప్పటినుంచి ఆలీలోని కామాంధుడు బయటకు వచ్చాడు. ఎప్పుడు పడితే అప్పుడు తనను కలవాలని, కోరిక తీర్చాలని వేధించడం మొదలుపెట్టాడు. తన మాట వినకపోతే న్యూడ్ ఫోటోలు బయటపెడతానని బెదిరించాడు. దీంత ఆమె ఆలీ కోరిన చోటకల్లా వెళ్తుండేది. సోమవారం ముంబయిలోని ఓ ప్రాంతానికి రావాలని ఆలీ చెప్పడంతో బాధితురాలు అక్కడికి వెళ్లింది. పక్కా ప్లాన్ ప్రకారం ఆలీ తన స్నేహితుడు నూర్ షేక్‌తో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి వారిద్దరూ వెళ్లిపోయారు. బాధితురాలు ఈ విషయాన్ని తన అక్కకు చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. Also Read:
By September 18, 2019 at 08:49AM
No comments