Breaking News

భర్త విదేశాల్లో... ఇంట్లోనే ప్రియుడితో భార్య రాసలీలలు


భర్త విదేశాల్లో కష్టపడి సంపాదిస్తుంటే ఆ మహిళ మాత్రం ఆ డబ్బులతో విలాసాలు చేస్తూ వేరే వ్యక్తితో పెట్టుకుంది. రోజూ రాత్రికి ప్రియుడిని రప్పించుకోవడం తెల్లవారుజాము వరకు ఎంజాయ్ చేసి పంపించడం ఇదే దినచర్యగా పెట్టుకుంది. ఎట్టకేలకు కోడలి బాగోతం అత్తగారి కంట పడింది. తన బండారం బయటపడటంతో ఆ కోడలు ప్రియుడితో కలిసి పరారైంది. Also Read: తమిళనాడులోని పుదుక్కోటై జిల్లా కోవిల్‌పట్టికి చెందిన సులోచన(32)కు అరిమళం సమీపంలోని మేల్‌నిలైపట్టికి చెందిన వ్యక్తితో రెండేళ్ల క్రితం వివాహమైంది. భర్త ఉపాధి నిమిత్తం పెళ్లయిన రెండు నెలలకే సింగపూర్ వెళ్లిపోవడంతో సులోచన అత్తగారింట్లోనే ఉంటోంది. ఆ దంపతులకు ఇంకా పిల్లలు కలగలేదు. మూడు నెలల క్రితం సులోచన భర్త ఇంటికి వచ్చి కొద్దిరోజులు ఉన్నాడు. తాను పగలూ రాత్రి కష్టపడి సంపాదించిన డబ్బుతో కొత్త ఇల్లు కొని, భార్య, అమ్మకు అన్ని వసతులు సమకూర్చి తిరిగి వెళ్లిపోయాడు. Also Read: భర్త విదేశాల్లో ఉండటం, డబ్బుకు, వసతులకు లోటు లేకపోవడంతో సులోచన బుద్ధి దారితప్పింది. స్థానికంగా ఉండే మాణిక్య అనే యువకుడితో అమె అక్రమ సంబంధం పెట్టుకుంది. రోజూ అత్తగారు పడుకున్నాక ప్రియుడిని గదికి రప్పించుకోవడం, తెల్లవారుజాము వరకు ఎంజాయ్ చేయడం ఇదే దినచర్యగా పెట్టుకుంది. అయితే రోజూ రాత్రి తన కోడలి గదికి ఎవరో వస్తున్నట్లు గుర్తించిన అత్త గురువారం రాత్రి నిఘా పెట్టింది. మాణిక్య గుట్టుచప్పుడు కాకుండా సులోచన గదిలోకి దూరగానే బయట గడియపెట్టి స్థానికులను పిలిచింది. ఈ విషయం తెలుసుకున్న సులోచన, మాణిక్య మరో తలుపు పగులగొట్టుకుని బైక్‌పై పరారయ్యారు. కోడలి నిర్వాకంపై అత్త ఫిర్యాదు చేయడంతో పోలీసులు సులోచన, ఆమె ప్రియుడిపై కేసు నమోదు చేసుకుని ఆ జంట కోసం గాలింపు చేపట్టారు. Also Read:


By September 08, 2019 at 08:51AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/tamilnadu-married-woman-eloped-with-lover-case-filed/articleshow/71031306.cms

No comments