Breaking News

స్నేహితుడి భార్యతో అఫైర్.. అడ్డుగా ఉందని భార్య హత్య


స్నేహితుడి భార్యతో కొనసాగిస్తున్న వివాహేతర సంబంధానికి అడ్డొస్తుందన్న కారణంతో కట్టుకున్న భార్యనే హత్య చేశాడో వ్యక్తి. తమిళనాడుకు చెందిన ఆ వ్యక్తి పక్కా ప్లాన్‌తో ఆమెను తిరుపతికి తీసుకొచ్చి ప్రాణం తీసి పరారయ్యాడు. Also Read: చెన్నైకు చెందిన మురుగన్‌ 20ఏళ్ల క్రితం సింధియా(40) అనే మహిళను కులాంతర వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. ఇటీవల భార్యను పట్టించుకోవడం మానేసిన మురుగన్ స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సింధియా భర్తను నిలదీసింది. చెడు తిరుగుళ్లు మానుకుని బుద్ధిగా ఉండాలని కోరింది. అయితే పూర్తిగా ప్రియురాలి మాయలో పడిపోయిన మురుగన్ భార్య మాటలు పట్టించుకోలేదు. పైగా తన సంతోషానికి అడ్డొస్తుందన్న ఆక్రోశంతో భార్యను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. Also Read: పథకం ప్రకారం ఆగస్టు 23న భార్యా పిల్లలను తిరుపతికి తీసుకెళ్లాడు. పీకే లేఅవుట్‌లోని లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నాడు. అదేరోజు రాత్రి సింధియా నిద్రపోతున్న సమయంలో బెల్టుతో మెడ బిగించి, ఊపిరాడకుండా దిండుతో ముఖాన్ని అదిమిపెట్టి చంపేశాడు. అనంతరం లాడ్జి నుంచి పరారయ్యాడు. మరుసటి ఉదయం గదిలోకి వెళ్లి చూసిన లాడ్జి సిబ్బంది సింధియా చనిపోయి కనిపించడం, మురుగన్ గదిలో లేకపోవడంతో అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో తిరుపతి పోలీసులు మురుగన్‌పై హత్యా కేసు నమోదు చేసి శుక్రవారం అరెస్ట్ చేశారు. భార్యను తానే చంపినట్లు మురుగన్ నేరం అంగీకరించడంతో అతడిని రిమాండ్‌కు తరలించారు.


By September 08, 2019 at 08:41AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/tamilnadu-man-kills-wife-in-tirupati-due-to-illegal-affair/articleshow/71031251.cms

No comments