Breaking News

‘నా భర్త చిత్రహింసలు పెడుతున్నాడు’... ప్రధానికి సీనియర్ అధికారి భార్య లేఖ


భర్త తనను దారుణంగా హింసిస్తున్నాడంటూ ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ సీనియర్ అధికారి భార్య ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే ఫిర్యాదు చేసింది. ప్రభుత్వంలో కేబినెట్ స్థాయిలో పనిచేస్తున్న బాబూరామ్ నిషాద్ అనే ఉద్యోగిపై ఆయన భార్య నీతు సంచలన ఆరోపణలు చేసింది. తనపై జరుగుతున్న దాడిని వివరిస్తూ ప్రధానమంత్రికి రాసిన లేఖను ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడం కలకలం రేపింది. Also Read: ‘నా భర్త నన్ను తీవ్ర చిత్రహింసలు పెడుతున్నాడు. రోజూ చితకబాదుతున్నాడు. గన్ చూపించి నాతో పాటు అమ్మానాన్నలను చంపేస్తానని బెదిరిస్తున్నాడు. నా మీద మూత్రం కూడా పోశాడు. కేబినెట్‌ హోదాలో ఉండి కూడా ఇలా ప్రవర్తిస్తున్నాడు. పోలీసు అధికారుల అండతో ఆయన రెచ్చిపోతున్నాడు. ఈ విషయంలో మీరు కలగచేసుకుని నాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నా’ అని బాధితురాలు ప్రధాని రాసిన లేఖలో పేర్కొంది. దీనిపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా కలగచేసుకోవాలని ఆమె కోరుతోంది. Also Read:


By September 29, 2019 at 08:14AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/he-urinated-torture-on-me-wife-of-senior-up-govt-official-reports-abuse-writes-to-pm/articleshow/71356483.cms

No comments