ప్రియుడితో పారిపోయిన తల్లి.. కన్న కొడుకులు ఏం చేశారంటే
బంధువుతో పెట్టుకుని అతడితో పారిపోయిన మహిళను ఆమె కన్న కొడుకులే పైశాచిక దాడికి పాల్పడ్డాడు. తల్లిని వెతికి పట్టుకుని గ్రామానికి తీసుకొచ్చి చితకబాదారు. ప్రియుడి మూత్రాన్ని ఆమెతో తాగించారు. ఈ ఘటన రాజస్థాన్‌లో జరిగింది. Also Read: రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాకు చెందిన ఓ మహిళ(45)కు ఇద్దరు కుమారులున్నారు. భర్త చనిపోవడంతో ఆమె సమీప బంధువు(35)తో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం కొడుకులకు తెలియడంతో పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. పది రోజుల క్రితం ఆమె ప్రియుడితో కలిసి ఎక్కడికో వెళ్లిపోయింది. తల్లి చేసిన పనితో కుటుంబం పరువు పోయిందని భావించిన కొడుకులిద్దరూ ఆమె కోసం గాలించారు. రెండ్రోజుల క్రితం తల్లి, ఆమె ప్రియుడిని పట్టుకుని గ్రామానికి తీసుకొచ్చారు. తల్లి జుట్టు కత్తిరించారు. అనంతరం ప్రియుడి మూత్రాన్ని తాగించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. Also Read: ఈ అమానుష ఘటనను గ్రామస్థులు కొందరు వీడియో తీసి సోషల్‌మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది. దీనిపై నాగౌర్ జిల్లా ఏఎస్పీ నితేశ్ ఆర్యా స్పందించి స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో గ్రామానికి వెళ్లిని పోలీసులు బాధితురాలిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. ఆమె ఫిర్యాదు మేరకు కొడుకులిద్దరిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. Also Read:
By September 19, 2019 at 12:04PM
No comments