Breaking News

ఆయనంటే నాకు గౌరవం, ప్రేమ.. టెక్నీషియన్‌పై మహేష్ బాబు ప్రశంసలు


‘‘మహేష్ బాబు మనసు వెన్న’’.. ఈ మాట చాలా మంది అంటుంటారు. ముఖ్యంగా ఆయనతో కలిసి పనిచేసిన నటీనటులు, టెక్నీషియన్స్ నుంచి ఈ మాట ఎక్కువగా వినిపిస్తుంటుంది. వాళ్లు మహేష్‌ను అంతగా ఎందుకు పొగుడుతారో తాజాగా ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ చూస్తే అర్థమవుతుంది. సాధారణంగా మనం తెరపై కనిపించే హీరోహీరోయిన్లు, నటీనటులను మాత్రమే పట్టించుకుంటాం. మహా అయితే దర్శకుడు, సంగీత దర్శకుడు, నిర్మాతను గుర్తుపెట్టుకుంటాం. కానీ, ఒక సినిమా కోసం తెర వెనుక కొన్ని వందల మంది పనిచేస్తారు. వాళ్లను సినిమాలో నటించే హీరోహీరోయిన్లు కూడా పెద్దగా గుర్తుపెట్టుకోరు. కానీ, మహేష్ బాబుకు తన సెట్‌లోని ఒక వ్యక్తి జీవితాంతం గుర్తుండిపోతారు. దానికి కారణం కూడా ఆయనే చెప్పారు. Also Read: ‘‘నా సౌండ్ రికార్డిస్ట్ నగర రామును మీకు పరిచయం చేస్తున్నాను. ఆయన్ని మేమంతా ఇలానే ప్రేమగా పిలుస్తాం. నా మొట్టమొదటి సినిమా నుంచి ఆయన నాతో పనిచేస్తున్నారు. నాది తప్ప ఏ ఇతర సినిమా సెట్‌‌ను ఆయన ఇప్పటి వరకు చూడలేదు. ఎల్లప్పుడూ నాతో, నా వెన్నంటే ఉండే ఆయనంటే నాకు ఎంతో ప్రేమ, గౌరవం. ‘అన్నాతమ్ముడు’, ‘దూకుడు’, ‘మహర్షి’, ‘సరిలేరు నీకెవ్వరు’ లొకేషన్స్‌లో ఆయన ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలను మిగిల్చారు’’ అని మహేష్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. రాముతో దిగిన ఫొటోలను షేర్ చేశారు. తన దగ్గర పనిచేసే ఒక టెక్నీషియన్ గురించి మహేష్ ఇంత గొప్పగా చెప్పారటంటే రాము అంటే ఆయనకి ఎంత ప్రత్యేకమో అర్థమవుతోంది. కాగా, ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్మీ మేజర్‌గా కనిపించనున్నారు.


By September 19, 2019 at 12:37PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/mahesh-babu-introduced-his-sound-recordist-nagara-ramu-to-his-fans/articleshow/71197903.cms

No comments