Breaking News

బాయ్‌ఫ్రెండ్‌‌తో సెక్స్ చేస్తుండగా వీడియో తీసి గ్యాంగ్ రేప్.. నిద్రమాాత్రలు మింగిన బాధితురాలు


బాయ్‌ఫ్రెండ్‌తో బహిరంగంగా సెక్స్ చేసిన ఓ నర్సింగ్ స్టూడెంట్‌ని చిక్కుల్లో పడింది. ఈ తతంగాన్ని సెల్‌ఫోన్లో రికార్డ్ చేసిన ముగ్గురు యువకులు ఆమెను బెదిరించి అనేకసార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీనికి తోడు ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించారు. తాము చెప్పిన మాట వినకపోయినా, ఈ విషయాన్ని ఎవరికైనా చెప్పినా వీడియో బయటపెట్టి పరువు తీస్తామని బెదిరించారు. దీంతో బాధను మౌనంగా భరించింది. అయితే ఆ కామాంధుల వేధింపులు మరింత ఎక్కువ కావడంతో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. తమిళనాడులో జరిగిన ఈ కీచకపర్వం వివరాలిలా ఉన్నాయి. Also Read: తమిళనాడులోని నామక్కల్‌ జిల్లాలోని ఓ పట్టణానికి చెందిన యువతి హాస్టల్‌లో ఉంటూ నర్సింగ్ కోర్సు చదువుతోంది. ఆమెకు ఓ యువకుడితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. దీంతో వారిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగేవారు. ఆగస్టు నెలలో ఓ రోజు రాత్రివేళ హాస్టల్ పరిసరాల్లోనే కలుసుకున్న ఈ జంట హద్దులు దాటింది. బాయ్‌ఫ్రెండ్ కోరిక మేరకు ఆ యువతి హాస్టల్ గోడ పక్కనే బహిరంగంగా అతడితో సెక్స్‌లో పాల్గొంది. Also Read: అదే సమయంలో అటుగా వచ్చిన స్థానిక యువకులు విజయ్‌కుమార్(23, శంకర్(27), వరదరాజన్(27) ఆ తతంగాన్నంతా వీడియో తీశారు. ఆ తర్వాత యువతి ఫోన్ నంబర్ తెలుసుకుని ఆ వీడియోను ఆమెకు పంపించారు. దీంతో బెదిరిపోయిన యువతి ఆ వీడియో డిలీట్ చేయాలని కోరగా వారు తమ కోర్కెను బయటపెట్టారు. ఎటూ పాలుపోని స్థితిలో బాధితురాలు వారికి లొంగిపోయింది. దీన్ని అలుసుగా తీసుకున్న ముగ్గురూ నిత్యం ఆమెను వేధించేవారు. తాము చెప్పిన చోటికి ఆమెను రప్పించి సామూహిక అత్యాచారానికి పాల్పడేవారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే వీడియో సోషల్‌మీడియాలో పెడతామని బెదిరించారు. దీంతో ఆమె మానసికంగా కుంగుబాటుకు గురైంది. Also Read: ఓ రోజు బాధితురాలికి వీడియో కాల్ చేసిన ఆ ముగ్గురు తమతో న్యూడ్ చాట్ చేయాలని వేధించారు. దీంతో భయపడిపోయిన ఆమె నిద్రమాత్రలు మింగేసింది. హాస్టల్ నిర్వాహకుల సమాచారంతో కుటుంబసభ్యులు అక్కడికి చేరుకుని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఏం జరిగిందని వారు ఆరా తీయగా విషయం మొత్తం చెప్పింది. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు సమాచారమిచ్చారు. బాధితురాలి ఫిర్యాదు అందుకున్న పోలీసులు విజయ్‌కుమార్, శంకర్‌ను అరెస్ట్ చేశారు. మూడో నిందితుడు వరదరాజన్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్లో విజయ్, శంకర్ నిరుద్యోగులు కాగా.. వరదరాజన్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. చదువుకునే వయస్సులో యువత హద్దులు దాటిగే ఇలాంటి ప్రమాదాలే ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. Also Read: గమనిక: అత్యాచారాలు, లైంగిక వేధింపుల కేసుల్లో బాధితులకు సంబంధించి గోప్యత పాటించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారి పేర్లు, వివరాలు వెల్లడించడంలేదు.


By September 18, 2019 at 10:30AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/nursing-student-gang-raped-several-times-in-tamilnadu-two-accused-arrested/articleshow/71178861.cms

No comments