Breaking News

మహిళను అడవిలోకి లాక్కెళ్లి... ఐదుగురి గ్యాంగ్ రేప్


పొలంలో పశువులను మేపుతున్న మహిళను ఐదుగురు వ్యక్తులు సమీపంలోని అటవీ ప్రాంతానికి తరలించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన రాజస్థాన్‌లోని ఝలావర్ జిల్లాలో జరిగింది. జిల్లాలోని ఓ గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం పశువులను మేపుతున్న మహిళ(30)ను ఐదుగురు వ్యక్తులు చుట్టుముట్టి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అనంతరం ఆమె నోరునొక్కి సమీపంలోని అటవీ ప్రాంతంలోకి ఎత్తుకెళ్లారు. Also Read: అక్కడ బాధితురాలిపై ఒకరి తర్వాత ఒకరు అర్ధరాత్రి వరకు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె అపస్మాకర స్థితిలోకి వెళ్లిపోవడంతో ఆ కామాంధులు అడవిలోనే వదిలేసి పరారయ్యారు. బుధవారం ఉదయం మెలకువ వచ్చిన బాధితురాలు ఇంటికి చేరుకుని తనపై జరిగిన అఘాయిత్యం గురించి అత్తమామలకు చెప్పింది. దీంతో సూరత్‌లో ఉంటున్న ఆమె భర్తను రప్పించి పోలీసులకు ఫిర్యాదు చేయించారు. Also Read: తమ పక్కింట్లో ఉండే వ్యక్తి నలుగురు స్నేహితులతో కలిసి తనను ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. మహిళ ఫిర్యాదుతో పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:


By September 08, 2019 at 01:02PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/rajasthan-woman-gang-raped-by-neighbour-and-his-friends/articleshow/71033257.cms

No comments