పెళ్లి తరువాత సోకులతో షాకిస్తున్న నమిత.. స్లిమ్ లుక్ వైరల్
‘సొంతం’, ‘జెమిని’ సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆ తరువాత మాత్రం తెలుగులో పెద్దగా కనిపించలేదు. ఎక్కువగా తమిళ్ సినిమాలకే పరిమితం అయ్యింది. తమిళ్‌లో చాలా సినిమాలు చేసింది. దాంతో అక్కడ ఆమెకి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. బొద్దుగా ఉన్న హీరోయిన్స్‌ని అమితంగా ఇష్టపడే తమిళ ప్రేక్షకులు ఆమె అందానికి, నటనకు ఫిదా అయ్యారు. ఒక వీరాభిమాని అయితే ఏకంగా ఆమెకి గుడి కట్టించాడు. దీంతో కుష్బూ తరువాత మళ్ళీ ఆ క్రెడిట్ దక్కించుకున్న హీరోయిన్‌గా నిలిచింది నమిత. ‘బిల్లా’, ‘సింహ’ సినిమాల్లో స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చిన నమిత బాగా బొద్దుగా అనిపించడంతో పెద్దగా అవకాశాలు మాత్రం రాలేదు. అయితే తమిళ్ బిగ్‌బాస్ మొదటి సీజన్‌లో పాల్గొని మంచి పాపులారిటీ తెచ్చుకుని, ఆ హౌస్ నుండి బయటకు రాగానే ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్ అయిన వీరేంద్ర చౌదరిని పెళ్లిచేసుకుంది. వీరేంద్ర తెలుగువాడు కావడంతో నమిత తెలుగింటి కోడలు అయ్యింది. పెళ్లి తరువాత భర్తతో కలిసి మీడియాలో బాగానే సందడి చేసిన నమిత ఆ తరువాత మాత్రం పూర్తిగా ప్రైవేట్ లైఫ్‌కే పరిమితం అయ్యింది. దాంతో చాలామంది హీరోయిన్స్‌లానే పెళ్లి తరువాత ఆమె కెరీర్ కూడా క్లోజ్ అయిపోయింది అనుకున్నారు. కానీ నమిత మాత్రం ఇప్పుడు తన కొత్త అవతారంతో అందరికి సాలిడ్ షాక్ ఇచ్చింది. ఒక్కసారిగా ఆమెని చూస్తే నమిత అని గుర్తు పట్టడం కూడా కష్టమే. బొద్దుగుమ్మలా ఉండే నమిత కాస్త ఇప్పుడు ముద్దు గుమ్మలా మారింది. జిమ్‌లో ఎంత టైం గడుపుతుందో, ఎన్ని గంటలు కష్టపడుతుందో తెలియదు కానీ సూపర్ స్లిమ్ లుక్‌లోకి వచ్చేసింది. వర్కౌట్స్ చేసి తగ్గడం వల్ల ఆమె ఫేస్‌లో గ్లో కూడా బావుంది. అందుకే ఆమె రీసెంట్ ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆ ఫోటోస్ చూసి ప్రేక్షకులే షాకవుతున్నారు. ఫిల్మ్‌మేకర్స్ నుండి ఆఫర్స్ వెల్లువెత్తుతాయి అనడంలో సందేహం లేదు. కాకపోతే ఆమె ఇప్పుడే సినిమాల్లో నటిస్తుందా, మరికొంతకాలం మ్యారీడ్‌లైఫ్‌ని ఎంజాయ్ చేసాక వస్తుందా? అనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ లేదు. చాలా మంది హీరోయిన్స్ పెళ్లి తరువాత తమ ఫిజిక్ మెయింటైన్ చెయ్యలేక సినిమాలకు, నటనకు టాటా చెప్పేస్తారు. కానీ, నమిత మాత్రం డిఫరెంట్‌గా పెళ్లి తరువాత తన రూపాన్ని మార్చుకుని పూర్తిస్థాయిలో నటిగా మళ్ళీ ఫామ్‌లోకి రావడానికి రెడీ అవుతుంది. అందుకే నమిత హాట్ మాత్రమే కాదు గ్రేట్ కూడా.
By September 08, 2019 at 01:17PM
No comments