మత్తు మందిస్తూ 50రోజుల పాటు మహిళపై గ్యాంగ్ రేప్
రాజస్థాన్‌లో మహిళలపై అత్యాచారాలు, దాడులకు అంతే లేకుండా పోతోంది. నిత్యం ఏదొకచోట కామాంధుల చేతిలో మహిళ అబలగా మారిపోతోంది. పశవాంఛ తీర్చుకునే క్రమంగా కామాంధులు రెచ్చిపోతున్నారు. రాజస్థాన్‌లో నలుగురు వ్యక్తులు ఓ యువతిని కిడ్నాప్ చేస్తూ రోజూ అత్యాచారానికి పాల్పడుతూ నరకం చూపించారు. రెండు నెలల పాటు ఆమెపై లైంగిక దాడికి పాల్పడుతూనే ఉన్నారన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. Also Read: రాజస్థాన్‌లోని బెహరార్‌కు చెందిన ఓ యువతికి కొత్తగా పెళ్లయింది. జులై 20వ తేదీన ఆమె ఓ పని నిమిత్తం ఒంటరిగా బయటకు వచ్చింది. ఆమెపై కన్నేసిన నలుగురు యువకులు ఆమెను బెదిరించి కారులో అపహరించుకుని పోయారు. ఓ చోట నిర్బంధించి ఆమెను లైంగిక కోరిక తీర్చాలని వేధించారు. బాధితురాలు ససేమిరా అనడంతో ఆమెకు పెట్టే ఆహారంగా డ్రగ్స్ కలిపి తినిపించేవారు. ఆమె మత్తులోకి జారుకున్న తర్వాత ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. Also Read: బాధితురాలు ఎక్కడికి పారిపోకుండా ఉండేందుకు ఎప్పుడూ తాళ్లతో బంధించేవారు. తమ కోరిక తీర్చుకునే సమయంలో మాత్రం ఆమె కట్లు విప్పి గదిలోకి తీసుకెళ్లి నరకం చూపించేవారు. వారి పైశాచికత్వానికి సాక్ష్యంగా ఆమె గర్భం కూడా దాల్చింది. అయితే కొద్దిరోజుల క్రితం ఆమెను గదిలో నిర్బంధించిన ఆ కామాంధులు తాళ్లతో కట్టడం మరిచిపోవడంతో బాధితురాలు తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది. రెండ్రోజుల క్రితం బాధితురాలి నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు నలుగురు యువకులపై రేప్ కేసు నమోదు చేశారు. యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం నిందితులను అనిల్‌కుమార్, దయానంద్, రామ్ అవతార్, రొహతాశ్‌లుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వారంతా ప్రస్తుతం పరారీలో ఉన్నారని, త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. Also Read:
By September 15, 2019 at 08:34AM
No comments