అహోబిలం అరణ్యంలో ప్రేమజంట ఆత్మహత్య
ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో కలకాలం హాయిగా బతకాలనుకున్నారు. ఇంతలో ఏమైందో తెలీదు కానీ ఆశలను చిదిమేసుకుంటూ ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. Also Read: కడప జిల్లా పెద్దముడియం మండలం దిగువ కల్వటాలకు చెందిన మనోజ్‌కుమార్ (20), కొండసుంకేసులకు చెందిన వెంకటలక్ష్మి(20) జమ్మలమడుగులోని ఎస్వీ డిగ్రీ కాలేజీలో సెకండియర్ చదువుతున్నారు. కొంతకాలంగా వీరు ప్రేమించుకుంటున్నారు. అయితే కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం ఎగువ అటవీ ప్రాంతంలో ప్రహ్లాదబడి వీరు శనివారం ఆత్మహత్య చేసుకున్నారు. వీరిని గుర్తించిన కొందరు భక్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. Also Read: మనోజ్‌కుమార్, వెంకటలక్ష్మి శుక్రవారం అటవీ ప్రాంతంలో చాలాసేపు సంచరిస్తుండగా తాము చూశాడని కొందరు స్థానికులు పోలీసులకు చెప్పారు. వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించరన్న ఆందోళనతోనే వారు ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. దీనిపై మృతుల కుటుంబాలకు సమాచారమిచ్చినట్లు పోలీసులు తెలిపారు. Also Read:
By September 15, 2019 at 08:21AM
No comments