యువతిపై కొడుకు రేప్.. వీడియో తీసి రూ.4లక్షలు దోచుకున్న తల్లి
యువతిని ప్రేమ పేరుతో ముగ్గులోకి దించి కొడుకు చేస్తే.. ఆ తతంగాన్నంతా అతడి తల్లి వీడియో తీసి బాధితురాలి నుంచి ఏకంగా రూ.4లక్షల కొట్టేసిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది. బలోడా బజార్ జిల్లా కేంద్రానికి ఓ యువకుడు స్థానికంగా నివసించే ఓ యువతితో స్నేహం చేసి ప్రేమలోకి దించాడు. ఆమె ఆర్థికంగా కాస్త ఉన్నత కుటుంబానికి చెందినది కావడంతో ఎలాగైనా డబ్బులు గుంజాలని తల్లితో కలిసి ప్లాన్ చేశాడు. కొద్దిరోజుల క్రితం ఆ యువకుడు తన ప్రియురాలిని ఇంటికి తీసుకెళ్లాడు. ఆమెను అతడి తల్లి సాదరంగా ఆహ్వానించి మర్యాదలు చేసింది. స్నాక్స్ తినిపించింది. Also Read: అవి తిన్న కాసేపటికే యువతిని నిద్రలోకి జారుకుంది. మత్తులో ఉన్న యువతిని బెడ్‌రూమ్‌లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తల్లి కొడుకును ఎంకరేజ్ చేస్తూ ఆ ఘటన అంతా వీడియో తీసింది. కొద్దిసేపటి తర్వాత మెలకువ వచ్చిన బాధితురాలు తనపై జరిగిన అఘాయిత్యం గురించి తెలుసుకుని కుమిలిపోయింది. ‘నిన్ను నా కొడుకు రేప్ చేశాడు. దాన్నంతా నేను వీడియో తీశాను. నేను అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వకపోతే ఆ వీడియోను బయటపెట్టి నీ పరువు తీస్తా’ అని తల్లి బాధితురాలిని బెదిరించింది. Also Read: ఈ ఘటన జరిగిన కొద్దిరోజుల తర్వాత యువతి తండ్రి పొలం అమ్మిన రూ.6లక్షల నగదు కూతురికి ఇచ్చి దాచమన్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ తల్లీకొడుకులు ఆమెను డబ్బు కోసం వేధించడంతో రూ.4లక్షలు సమర్పించుకుంది. యువకుడి అక్కాబావకు ఈ విషయం తెలియడంతో వారు కూడా యువతిని డబ్బు కోసం బెదిరించారు. ఈలోగా ఏదో అవసరం రావడంతో ఆమె తండ్రి రూ.6లక్షలు ఇవ్వాలని కూతురిని అడగ్గా రూ.2లక్షలే ఇచ్చింది. మిగిలిన డబ్బులు ఏమయ్యాయని అతడు అడగడంతో తనకు జరిగిన అఘాయిత్యం గురించి చెప్పి బోరుమంది. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ తల్లీకొడుకును అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపారు. Also Read:
By September 20, 2019 at 08:57AM
No comments