Breaking News

Jagan మాటలు కోటలు దాటుతున్నాయి కానీ.. జనానికి గుక్కెడు నీళ్లు ఇవ్వట్లేదు: లోకేశ్


టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై మరోసారి విమర్శలు ఎక్కుబెట్టారు. సీమలో ఉన్న కరువు పరిస్థితులను ప్రస్తావించిన ఆయన.. జగన్ మాటలు కోటలు దాటుతున్నాయి కానీ.. జనానికి గుక్కెడు నీళ్ళు కూడా ఇవ్వలేకపోతున్నారంటూ ఎద్దేవా చేశారు. గత రెండు నెలలుగా దేశంలోనే అత్యల్ప వర్షపాతం రాయలసీమలో నమోదైందని .. తాగేందుకు కూడా నీళ్లు లేకపోవడంతో సీమ జిల్లాల ప్రజలు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమలో కరువు తాండవిస్తోంది. మీ అవగాహనా రాహిత్యానికి ప్రజలు ఇంకెన్నాళ్లు ఇబ్బందులకు గురవ్వాలి? ప్రజల పట్ల మరీ ఇంత ఉదాసీనతా? అని జగన్‌ను లోకేశ్ ప్రశ్నించారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఉంటే, జలవాణి కార్యక్రమం ద్వారా, ట్రాక్టర్లతో నీటి సరఫరా జరిగేదని లోకేశ్ తెలిపారు. ‘‘మా మీద కోపంతో అది కూడా ఎత్తేసినట్టు ఉన్నారు. అయ్యా జగన్ గారూ! మన నీళ్లు తెలంగాణాకు తరువాత ఇవ్వచ్చు, ముందు సీమ ప్రజలకు, త్రాగు నీరు ఇవ్వండి’’ అని లోకేశ్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. గోదావరి జలాలను తెలంగాణ మీదుగా రాయలసీమ జిల్లాలకు తరలిస్తామని.. ఇందుకోసం కేసీఆర్‌తో కలిసి పని చేస్తామని ఏపీ సీఎం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. జగన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా లోకేశ్ ఇలా సెటైర్లు వేశారు. ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులకు పనులు దొరకడం లేదని నారా లోకేశ్ ఆరోపించారు. పనుల్లేకపోవడంతో కార్మికులు తమ పిల్లలను పస్తులు పడుకోబెడుతున్నారన్నారు. మరో వైపు మీ నేతలు ఇసుక అమ్మకాలతో డబ్బుల మూటలు దోచుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మీ పార్టీ సానుభూతిపరుల మాటలు ఓసారి వినండి. ఇంత సక్రమంగా నడుస్తున్న మీ పాలనకు జోహార్లు అని సీఎం జగన్‌ను ఉద్దేశించి లోకేశ్ ట్వీట్ చేశారు.


By August 11, 2019 at 02:41PM


Read More https://telugu.samayam.com/andhra-pradesh/news/tdp-leader-nara-lokesh-criticizes-ap-cm-ys-jagan-for-not-providing-drinking-water-to-drought-hit-rayalaseema-people/articleshow/70628655.cms

No comments