ఇద్దరు చిన్నారులను భుజాలపై కూర్చోబెట్టుకొని.. వరద నీటిలో పోలీస్ సాహసం

భారత పశ్చిమ తీరంలోని కేరళ నుంచి గుజరాత్ వరకు భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు పోటెత్తుతున్నాయి. లక్షలాది మంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, కోస్టల్ గార్డ్ బలగాలు.. అహర్నిశలు శ్రమిస్తూ వరదలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. మహరాష్ట్ర, గుజరాత్, కేరళల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గతంలో ఎన్నడూ లేనంతగా వరదలు వస్తుండటంతో అధికార యంత్రాంగం సహాయక కార్యక్రమాల్లో తలమునకలైంది. రెస్క్యూ టీం తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ వరద బాధితులను కాపాడుతున్నారు. గుజరాత్‌లోని కళ్యాణ్‌పూర్ గ్రామంలో పృథ్వీరాజ్ సిన్హ్ జడేజా అనే కానిస్టేబుల్ నడుముల్లోతు నీటిలో ఇద్దరు చిన్నారులను భుజాలమీద కూర్చోబెట్టుకొని తీసుకొస్తున్న వీడియో వైరల్‌గా మారింది. భారీ వరదలోనూ చిన్నారులను ఎత్తుకొని తీసుకెళ్తున్న కానిస్టేబుల్‌పై గుజరాత్ సీఎం ప్రశంసలు గుప్పించారు. విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ సిబ్బంది ఎంతగా శ్రమిస్తున్నారో, అంకిత భావంతో పని చేస్తున్నారో చెప్పడానికి ఈ ఘటన ఓ నిదర్శనం అని ఆయన ట్వీట్ చేశారు. వారి అకింతభావాన్ని ప్రశంసించడని.. కానిస్టేబుల్ వీడియోను పోస్ట్ చేశారు. మహారాష్ట్రలో వరద బాధితులను పడవలో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుండగా.. ఓ మహిళ జవాన్ల కాళ్లకు మొక్కిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. Read Also:
By August 11, 2019 at 01:52PM
No comments