Breaking News

హైదరాబాద్: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిపోయిన వైసీపీ నేత


హైదరాబాద్‌లో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఏపీకి చెందిన వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ దొరికిపోయారు. శనివారం అర్ధరాత్రి జూబ్లీహిల్స్ ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి యూత్ వింగ్ నేత ఆంజనేయులు మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులకు చిక్కారు. వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్‌లో నిర్వహించిన ఈ తనిఖీల్లో మొత్తం 24 మంది మందుబాబులపై కేసులు నమోదు చేశారు. 19 బైకులు, 4 కార్లు, ఒక ఆటోను సీజ్ చేసినట్లు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిన వారందర్ని సోమవారం కోర్టు ముందు హాజరపరచనున్నారు. హైదరాబాద్‌లో ప్రతి వీకెండ్ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.


By August 18, 2019 at 10:48AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/drunk-and-drive-case-filed-on-ysrcp-youth-wing-leader-in-hyderabad/articleshow/70721577.cms

No comments