Breaking News

‘రణరంగం’ టీమ్‌పై కాజల్ ఫైర్..!


గ్లామర్ భామ కాజల్ అగర్వాల్‌కి ఇప్పుడు టైం అస్సలు బావున్నట్టు లేదు. అందుకే వరసగా సినిమాలు ప్లాప్ అవుతున్నాయి. కవచం, సీత తాజాగా రణరంగంతో ఈ భామ సరైన హిట్టు కొట్టలేక చతికిలబడింది. కవచం, సీత సినిమాలు ప్లాప్ అయినా... శర్వానంద్ రణరంగాన్ని నమ్ముకున్నది ఈ భామ. కానీ రణరంగం సినిమాకి యావరేజ్ టాకొచ్చింది. అయినా కాజల్‌కి, ఆమె గ్లామర్‌కి, నటనకి పేరొచ్చినా.. ఆమెకి బావుండేది. కానీ సినిమాలో కాజల్ పాత్ర చూస్తే.. అదేమిటి కాజల్ ఇంతగా దిగజారిపోయి ఇలాంటి పాత్రలు ఒప్పేసుకుంటుంది అంటారు కాదు.. అంటున్నారు. రణరంగం మీద భారీ ఆశలు పెట్టుకున్న కాజల్ సినిమా విడుదలకు ముందు ఆ సినిమాని భారీగానే ప్రమోట్ చేసింది కూడా.

అయితే సినిమా పోతేపోయింది తనకైనా పేరొచ్చింది అనుకుంటానికి లేకుండా... కాజల్ పాత్రని రణరంగంలో డిజైన్ చేసాడు దర్శకుడు సుధీర్ వర్మ. అయితే అసలే పేరు రాలేదని బాధపడుతున్న కాజల్ కి ఇప్పుడు శర్వా మరో షాకిచ్చాడు. ఆదేమిటంటే కాజల్ ని హీరోయిన్ అనుకున్నప్పుడు ఆమె పాత్ర నిడివి ఎక్కువే... కానీ సినిమా పూర్తయ్యాక కాజల్ సీన్స్ ని ఎడిటింగ్‌లో కత్తిరించేశామని చెప్పాడు. ఆమెపై తీసిన పాట కూడా సినిమాలో లేకుండా పోయింది. అయితే సినిమా విడుదలయ్యాక కాజల్ రణరంగం యూనిట్ మీద కారాలు మిరియాలు నూరుతుందని.. సక్సెస్ మీట్ కి రమ్మన్నా.. తన పాత్రకి ప్రాధాన్యతే లేదు.. ఇంకా సక్సెస్ మీట్ కి వచ్చి ఏం మాట్లాడను అంటూ యూనిట్ మీద ఫైర్ అయినట్లుగా ఫిలింనగర్ టాక్.



By August 19, 2019 at 02:51AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/47115/kajal-agarwal.html

No comments