Breaking News

హైదరాబాద్‌: వివాహితను ఎత్తుకెళ్లి గ్యాంగ్ రేప్


పొట్టకూటి కోసం పొరుగు రాష్ట్రం నుంచి వచ్చిన ఓ వివాహితపై తమ ప్రాంతానికే చెందిన నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఒడిశాలోని బలంగీర్ జిల్లాకు చెందిన బాధితురాలు (30) జీవనోపాధి కోసం తన భర్త, రెండేళ్ల కుమారుడితో కలిసి నగరానికి వచ్చింది. నగర శివార్లలోని మహేశ్వరం మండలం నాగుల దోని తండాలోని ఇటుక బట్టిలో భర్తతో కలిసి పనిచేస్తోంది. వీరితోపాటు అదే జిల్లాకు చెందిన నలుగురు యువకులు రాహుల్‌ మాజీ(25), మనోజ్‌ సమారత్‌(23), దుర్గా సమారత్‌(20), దయా మాజీ(20) అక్కడే పనిచేస్తున్నారు. ఇటుక బట్టీల వద్దే వీరంతా నివాసం ఉంటున్నారని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో బాధితురాలు బహిర్భుమి వెళ్లగా, అప్పటికే కాచుకుని ఉన్న ఈ నలుగురు యువకులు ఆమెను వెంబడిచారు. అనంతరం ఆమెను అపహరించి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అఘాయిత్యం గురించి బాధిత మహిళ తన భర్తకు చెప్పడంతో అతడు ఇటుక బట్టీ యజమానికి తెలియజేశారు. ఆయన సాయంతో శనివారం ఉదయం మహేశ్వరం పోలీస్‌స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదుచేసి ఇబ్రహీంపట్నం ఏసీపీ యాదగిరిరెడ్డి, మహేశ్వరం ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి విచారణ చేపట్టారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తామన్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం తరలించామని, దర్యాప్తులో అన్ని విషయాలు వెలుగుచూస్తాయని పేర్కొన్నారు. నిందితులంతా 20 నుంచి 30 ఏళ్లలోపు యువకులేనని తెలిపారు. నిందితులపై ఐపీపీ సెక్షన్ 376 డి కింద కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్నవారి కోసం ఓ టీమ్‌ను నియమించారు.


By August 18, 2019 at 10:42AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/odisha-woman-gang-raped-by-four-youth-in-outskirts-in-hyderabad/articleshow/70721621.cms

No comments