Breaking News

YS Jagan గారూ.. వైసీపీ ఎంపీలు చాలా గ్రేట్: కేశినేని నాని


విజయవాడ ఎంపీ కేశినేని సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అయ్యారు. తాజా రాజకీయాలపై తనదైన శైలిలో సెటైర్లు పేలుస్తూ దూకుడుగా ఉన్నారు. సొంత పార్టీనే కాదు.. ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తున్నారు. ప్రజా వేదిక కూల్చివేత, ఇద్దరు సీఎంల భేటీ, సింగపూర్ విమానాలు రద్దు చేయడం, బీజేపీలో చేరిన టీడీపీ రాజ్యసభ సభ్యులు ఇలా తాజా రాజకీయాలపై ఫేస్‌బుక్, ట్విట్టర్ ద్వారా స్పందిస్తున్నారు. తాజాగా ప్రత్యేక హోదా, కేంద్ర బడ్జెట్‌పై వైసీపీ తీరుపై కేశినేని తనదైన శైలిలో స్పందించారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామన్న ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేస్తూ ట్వీట్ చేశారు విజయవాడ ఎంపీ. వైసీపీ ఎంపీలు గ్రేట్ అంటూ సెటైర్లు పేల్చారు . నాని తన ట్వీట్‌లో‘కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి బడ్జెట్‌లో రూ.21 కోట్లు సాధించిన గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి గారూ.. మీరు, మీ 22 మంది ఎంపీలు చాలా చాలా గ్రేట్ సార్‌’’అంటూ ఎద్దేవా చేశారు. మొన్నటి వరకు ఫేస్‌బుక్‌కే పరిమితమైన కేశినేని నాని.. ట్విట్టర్‌లోనూ బాగా యాక్టివ్ అవుతున్నారు.


By July 10, 2019 at 12:19PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/tdp-mp-kesineni-nani-satires-on-ysrcp-mps-over-union-budget/articleshow/70154785.cms

No comments