Breaking News

అన్న ప్రేమించిన యువతిపై అసభ్య ప్రవర్తన.. ఇద్దరి అరెస్ట్


అన్న పెళ్లి చేసుకునే యువతితో అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు యువకులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. మౌలాలీలోని ఏసీఐఐసీ కాలనీకి చెందిన దండె జఫానియా అనే యువకుడు, బోయిగూడకు చెందిన ఓ యువతి కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను యువతి తల్లిదండ్రులు తిరస్కరించడంతో ఆమె రెండేళ్ల క్రితమే ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. దీంతో ప్రేమికులిద్దరూ ఏపీఐఐసీ కాలనీలోనే ఓ గది అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఇటీవల జఫానియా తల్లిదండ్రులు వీరిద్దరిని ఇంటికి తీసుకెళ్లి యువతిని వేరుగా ఉండమని చెప్పి ఓ రూమ్ కేటాయించారు. అయితే పెళ్లి కాకుండా ఆమెను ఇంట్లో ఎలా ఉండనిస్తారంటూ జఫానియా తమ్ముళ్లు మాథ్యూ(26), జాన్‌స్మాల్(24) తల్లిదండ్రులతో గొడవ పెట్టుకునేవారు. అన్న లేని సమయంలో ఆ యువతితో అసభ్యంగా ప్రవర్తించి వేధించేశారు. ఈ నెల 7వ తేదీన ఇంట్లో తల్లిదండ్రులు, అన్న లేని సమయంలో మాథ్యూ, జాన్‌స్మాల్ యువతి గదిలోకి వెళ్లి అనుచితంగా ప్రవర్తించారు. ఆమెను తాకరాని చోట తాకి అవమానించారు. దుర్భాషలాడుతూ దాడి ఇళ్లు వదిలి వెళ్లకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో బాధితురాలు అదేరోజు మల్కాజ్‌గిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మాథ్యూ, జాన్‌స్మాల్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.


By July 10, 2019 at 12:33PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/two-men-arrested-over-indecent-behavior-on-brothers-lover/articleshow/70154893.cms

No comments