Breaking News

కీచక మైనర్లు.. పరిచయాన్ని అడ్డం పెట్టుకుని యువతిపై అత్యాచారయత్నం


పరిచయాన్ని అడ్డం పెట్టుకుని యువతిపై ఇద్దరు బాలురు అత్యాచారానికి యత్నించిన ఘటన మల్కాజ్‌గిరిలో శుక్రవారం రాత్రి జరిగింది. పోలీస్‌స్టేషన్ పరిధిలో నివసించే ఓ యువతి(20) ఆర్థిక అవసరాల నిమిత్తం స్థానికంగా ఓ బట్టల దుకాణంలో పనిచేస్తోంది. ఆమె స్నేహితురాలి ద్వారా ఇద్దరు బాలురు ఆమెకు పరిచయమయ్యారు. శుక్రవారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి చేరుకున్న యువతి వద్దకు ఇద్దరు బాలురు వచ్చి స్నేహితురాలు రమ్మన్నదని చెప్పి బైక్‌పై తీసుకెళ్లారు. ఆమెను దమ్మాయిగూడలోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. ఇక్కడికెందుకు తీసుకొచ్చారని ఆమె ప్రశ్నించేలోగానే ఇద్దరూ ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. అక్కలాంటిదానిని నన్ను వదిలేయండని యువతి వేడుకున్నా వారు కనికరించలేదు. మైనర్లిద్దరూ ఆమె వివస్త్రను చేసేందుకు యత్నించగా బాధితురాలు వారి నుంచి తప్పించుకుని పారిపోయింది. అదే రాత్రి జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. వారు బాధితురాలిని మల్కాజ్‌గిరి పోలీసులకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న మల్కాజ్‌గిరి ఎస్సై సంజీవరెడ్డి నిందితులను శనివారం అరెస్ట్ చేసి జువైనల్ హోమ్‌కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.


By July 14, 2019 at 08:39AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/two-minors-rape-attempt-on-young-woman-in-hyderabad/articleshow/70211614.cms

No comments