ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన సభకు అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యులంతా హాజరయ్యారు. వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభలో ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ కావటంతో ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మొత్తం 14 పని దినాల్లో రాష్ట్ర బడ్జెట్తో పాటు వివిధ అంశాలను చర్చించాలని బుధవారం జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. ముఖ్యంగా రాష్ట్ర బడ్జెట్తో పాటు వివిధ ప్రజా సమస్యలపై చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలిరోజు ప్రశ్నోత్తరాల కార్యక్రమంతో పాటు సీఎం జగన్ బీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రతిని సభ ముందుంచనున్నారు.
By July 11, 2019 at 09:11AM
No comments