Breaking News

ఇంతకీ ‘యాత్ర’ పరిస్థితి ఏమిటి?


ఎన్టీఆర్‌ బయోపిక్‌లో భాగంగా మొదటి పార్ట్‌ రూపంలో వచ్చిన ‘కథానాయకుడు’ చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది. కానీ దీనికి టాక్‌, రివ్యూలు అన్ని పాజిటివ్‌గానే వచ్చాయి. ఇక తాజాగా విడుదలైన వైఎస్‌ఆర్‌ సెమీ బయోపిక్‌ ‘యాత్ర’ తొలి రోజు డివైడ్‌ టాక్‌ని అందుకుంది. అయితే ఈ చిత్రాన్ని కేవలం మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి మాత్రమే ఒంటిచేత్తో నిలబెట్టాడనేది వాస్తవం. నిజానికి ‘కథానాయకుడు’లో యంగ్‌ ఎన్టీఆర్‌ పాత్రను బాలయ్య పోషించడం మైనస్‌ అయింది. దాంతో ఆ తప్పుని సరిదిద్దుకుంటూ ‘మహానాయకుడు’లో యంగ్‌ ఎన్టీఆర్‌ పాత్రను బాలయ్య చేత కాకుండా మరో నటుడితో చేయించనున్నారట. ఈ నిర్ణయం క్రిష్‌, బాలయ్యలు తీసుకున్న మంచి నిర్ణయమనే చెప్పాలి. కానీ ‘యాత్ర’ విషయంలో ఆ సమస్య రాలేదు. 

ఇది వైఎస్‌ఆర్‌ పూర్తి బయోపిక్‌ కాకుండా ఆయన పాదయాత్రకి సంబంధించిన సెమీ బయోపిక్‌ కావడంతో మమ్ముట్టి ఆ పాత్రకు అద్భుతంగా కుదిరి, అందులో లీనమై ఒదిగిపోయాడు. ఆయన చూపించిన సెటిల్డ్‌ పర్‌ఫార్మెన్స్‌ ఈ చిత్రానికి పెద్ద ప్లస్‌ పాయింట్‌. పాతికేళ్ల కిందట కె.విశ్వనాథ్‌ తీసిన ‘స్వాతికిరణం’, ఆ తర్వాత సుమన్‌తో పాటు మమ్ముట్టి తెలుగులో స్ట్రెయిట్‌ చిత్రాలు చేశాడు. ఆ తర్వాత మరలా తెలుగు తెరపై కనిపించలేదు. కొంతకాలం ఆయన మలయాళ చిత్రాలు డబ్బింగ్‌ రూపంలో వచ్చినా ప్రస్తుతం అవి కూడా రావడం లేదు. దాంతో అంత గ్యాప్‌ తర్వాత అందునా వైఎస్‌ ఆర్‌గా ఆయన నటిస్తూ, సొంతంగా డబ్బింగ్‌ చెప్పడం వంటి విషయాల్లో కాస్త అనుమానాలు ఉన్నా కూడా వాటిని మమ్ముట్టి పటాపంచలు చేశాడు. 

మరోవైపు ఈ చిత్రంలో రాజశేఖర్‌రెడ్డి రాజీ పడకుండా, అధిష్టానంతో సై అంటే సై అన్న సన్నివేశాలకు మంచి ఆదరణ లభిస్తోంది. అయితే పలువురు మాత్రం వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధిష్టానానికి, ఢిల్లీకి సూట్‌కేసులు మోసాడనే విమర్శ ఉంది. ఇక ఇందులో కెవిపి రామచంద్రరావు పాత్రను పోషించిన రావు రమేష్‌, సూరీడు పాత్రను చేసిన నటుడు బాగా మెప్పించారు. వైఎస్‌ హయాంలో వైఎస్‌కి వ్యతిరేకంగా అసమ్మతినేతగా వ్యవహరించిన వి.హనుమంతరావును పోలిన పాత్ర ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ పాత్రకు తోటపల్లి మధు న్యాయం చేశాడు. వి.హెచ్‌ తరహా భాష, వేషధారణ, వ్యంగ్యంగా విసిరిన సెటైర్లు వంటివి విహెచ్‌ గురించే అని చెప్పడంలో సందేహం లేదు. 

ఇక మనదేశం అన్న పార్టీని కూడా తెలుగుదేశాన్ని ఉద్దేశించే చూచాయగా దర్శకుడు మహి.వి.రాఘవ చూపించాడు. విహెచ్‌ ఎప్పుడు రెబలే. ఆమధ్య బస్పులపై అతికంచిన ‘అర్జున్‌రెడ్డి’ చిత్రంలోని కిస్సింగ్‌ సీన్‌ పోస్టర్స్‌ని ఆయన చించడం, వెంటనే విజయ్‌ దేవరకొండ, వర్మలు ఆయన్ని ‘చిల్‌ తాతయ్య’ అని ఆటపట్టించడం తెలిసిందే. మరి ‘యాత్ర’లోని తనని పోలిన పాత్రపై విహెచ్‌ ఎలా స్పందిస్తాడు? వైఎస్‌ని వాడు, వీడు అని మాట్లాడినట్లు చూపించడంపై ఆయన రియాక్షన్‌ ఎలా ఉంటుందో వేచిచూడాలి...! 



By February 10, 2019 at 03:26PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44662/mammootty.html

No comments