Breaking News

తగ్గేదే లేదంటున్న దగ్గుబాటి హీరో..!


నిజానికి ఈ తరం నటుల్లో దగ్గుబాటి రానాది ప్రత్యేకశైలి. హీరో పాత్ర అయినా అతిథి పాత్ర అయినా, ఆ పాత్రకు సినిమాలో ప్రాధాన్యం ఉంటే ఓకే చెబుతాడు. ఇలా ఆయన బాలీవుడ్‌, కోలీవుడ్‌లతో పాటు అన్ని భాషల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘లీడర్‌’ ద్వారా తెలుగులో శేఖర్‌మ్ముల దర్శకత్వంలో వచ్చిన చిత్రంతో టాలీవుడ్‌లో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ‘కృష్ణం వందే జగద్గురుం’తో పాటు పలు చిత్రాలలో నటించాడు. ఇక ఈయనకు ‘బాహుబలి’ చిత్రంలోని నెగటివ్‌ పాత్ర అయిన భళ్లాలదేవ ద్వారా భారీ ఇమేజ్‌ సొంతం అయింది. ఈయన నారాచంద్రబాబునాయుడు పాత్రని పోషిస్తున్న ‘మహానాయకుడు’ నేడే(శుక్రవారం) విడుదలైంది. ఇవే కాదు.. ‘హథీ మేరా సాథీ, 1945’తో పాటు ఐదు చిత్రాలు ఆయన చేతిలో ఉన్నాయంటే ఆయన క్రేజ్‌ని అర్ధం చేసుకోవచ్చు. 

ఇక తాజాగా ఈయన మరో చిత్రానికి ఓకే చెప్పాడు. తమిళంలో సిద్దార్థ్ హీరోగా ‘అవం’, తెలుగులో ‘గృహం’గా వచ్చి విజయం సాధించిన చిత్ర దర్శకుడు మిలింద్‌ రౌ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. ఈ చిత్రం స్క్రిప్ట్‌ కూడా పూర్తయిందని, డైలాగ్‌ వెర్షన్స్‌ పని నడుస్తోందని సమాచారం. మరోవైపు ఆయన కోనవెంకట్‌ నిర్మాతగా, అనుష్క ప్రధాన పాత్రలో హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో రూపొందనున్న ‘సైలెన్స్‌’ చిత్రంలో కూడా కీలకపాత్రను పోషిస్తున్నాడని అంటున్నారు. మైఖేల్‌ మాడిసన్‌తో పాటు అంజలి, షాలినీ పాండే, మాధవన్‌, సుబ్బరాజు వంటి వారు నటిస్తున్న ఇందులో అనుష్క ఎన్నారైగా నటిస్తుండగా, అంజలి ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌గా కనిపించనుంది. 

మార్చి నుంచి షూటింగ్‌ని ప్రారంభించుకునే ఈ చిత్రం వచ్చేనెలలో షూటింగ్‌ని ప్రారంభించుకోనుంది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ మూవీని తెలుగుతో పాటు తమిళంలో కూడా విడుదల కానుంది. కోన ఫిల్మ్‌ ఫ్యాక్టరి..పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీలు నిర్మిస్తున్న ఇందులో రానా పాత్ర ఎలా ఉంటుందో వేచిచూడాలి.. ఎందుకంటే ఇప్పటికే రానా, అనుష్కతో ‘రుద్రమదేవి’ చిత్రంలో జోడీ కట్టాడు. ‘బాహుబలి’లో అనుష్కపై కన్నేసి, వేధించే పాత్రను చేశాడు. మరి ఈ తాజా ‘సైలెన్స్‌’లో రానా దగ్గుబాటి పాత్ర ఎలా ఉంటుంది అనే దానిపై ఆసక్తి పెరుగుతోంది. 



By February 23, 2019 at 11:06AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44843/rana-daggubati.html

No comments