Breaking News

సంక్రాంతికి అక్కడా, ఇక్కడా అసలైన పోటీ!


తెలుగులో ఈ సంక్రాంతికి అంటే జనవరి 9వ తేదీన ఎన్టీఆర్‌ బయోపిక్‌గా క్రిష్‌ దర్శకత్వంలో రూపొందిన మొదటి పార్ట్‌ ‘కథానాయకుడు’ వస్తోంది. ఇక ఆ పక్క రోజునే సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన ‘పేట’, జనవరి 12న రామ్‌చరణ్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ‘వినయ విధేయ రామ’ రానున్నాయి. 12న దిల్‌రాజు నిర్మాతగా మొదటి మూడు చిత్రాలైన ‘పటాస్‌, సుప్రీం, రాజా ది గ్రేట్‌’ వంటి హ్యాట్రిక్‌ హిట్స్‌ సాధించిన అనిల్‌రావిపూడి దర్శకత్వంలో సీనియర్‌ స్టార్‌ విక్టరీ వెంకటేష్‌, యంగ్‌ స్టార్‌ మెగాప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌లు కలిసి నటిస్తున్న మల్టీస్టారర్‌ ‘ఎఫ్‌2’లు భారీ పోటీ మద్య విడుదల కానున్నాయి. 

అదే సమయంలో కోలీవుడ్‌లో కూడా గత దశాబ్దకాలంగా లేని అతి పెద్ద పోటీ ఈసారి ఏర్పడుతోంది. కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో సన్‌పిక్చర్స్‌ సంస్థ భారీగా రజనీ, త్రిష, సిమ్రాన్‌ల కలయికలో విజయ్‌సేతుపతితో పాటు బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్దిఖి దక్షిణాదికి పరిచయం అవుతోన్న ‘పెట్టా’ విడుదల కానుంది. తెలుగులో భారీ పోటీ వల్ల ఈ మూవీ డబ్‌ అవుతుందా? ముందుగా తమిళ వెర్షన్‌ని జనవరి 10న విడుదల చేసి, కాస్త గ్యాప్‌ ఇచ్చి తెలుగులో విడుదల చేస్తారా? అనే అనుమానాలు ఏర్పడ్డాయి. కానీ భారీగా థియేటర్లు దొరకపోయినా కూడా రజనీ ‘పేట’ కూడా జనవరి 10న విడుదల కానుంది. 

మరోవైపు రజనీ తర్వాత అంతటి ఫాలోయింగ్‌, క్రేజ్‌ ఉన్న తాలా అజిత్‌-దరువు శివ కాంబినేషన్‌లో ‘వీరం, వేదాళం, వివేగం’ వంటి చిత్రాల తర్వాత ‘విశ్వాసం’ మూవీ కూడా జనవరి 10నే విడుదల కానుంది. అయితే ఈ చిత్రం తెలుగు డబ్బింగ్‌ వెర్షన్‌ని మాత్రం ఆలస్యంగా విడుదల చేయనున్నారు. ఇందులో సౌత్‌ ఇండియన్‌ సూపర్‌స్టార్‌ నయనతార హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం. 

గతంలో ఎప్పుడో రజనీ నటించిన ‘చంద్రముఖి’, కమల్‌హాసన్‌లు నటించిన ‘ముంబై ఎక్స్‌ప్రెస్‌’లు పోటీగా విడుదలయ్యాయి. ఇప్పుడు రజనీ, అజిత్‌ల మద్యన అంత కంటే పెద్ద వారు నడుస్తోంది. థియేటర్లను ఇద్దరు స్టార్స్‌కి సరిసమానంగా పంచడంలో నానా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ముందు రోజు సాయంత్రం నుంచే బెనిఫిట్‌ షోలు పడనుండటంతో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చూసేందుకు పోలీస్‌లు నానా కుస్తీ పడి ప్రణాళికలను రెడీ చేస్తున్నారు. 



By January 04, 2019 at 06:07AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44148/sankranthi.html

No comments