Breaking News

ప్రభాస్‌కు మళ్లీ ‘బాహుబలి’ రేంజ్ సినిమా!


యంగ్‌ రెబెల్‌స్టార్‌ ప్రభాస్‌ కెరీర్‌ని తీసుకుంటే ‘బాహుబలి’ ముందు తర్వాత అని ఖచ్చితంగా విభజించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ‘బాహుబలి’కి ముందు ఆయన స్టార్‌కాదా? అంటే అవుననే చెప్పాలి. కానీ నేషనల్‌ స్టార్‌గా, ఐకాన్‌గా మాత్రం గుర్తింపు ‘బాహుబలి’తోనే వచ్చింది. ఒకప్పుడు ‘ఏక్‌నిరంజన్‌’ టైంలో ప్రభాస్‌తో గొడవలు పెట్టుకున్న క్వీన్‌ కంగనారౌనత్‌ నుంచి నేడు బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్లు కూడా ఒక్కసారైనా ప్రభాస్‌ సరసన నటించాలని ఉబలాటపడున్నారు. ఈ విషయాన్ని నేరుగా మీడియాకే చెబుతున్నారు. 

గతంలో ఎవరైనా బాలీవుడ్‌ హీరోయిన్‌ని టాలీవుడ్‌లో ఎవరితో నటించాలని ఉంది? అని ప్రశ్నిస్తే చిరంజీవి, నాగార్జున పేర్లు మాత్రమే ఎక్కువగా వినిపించేవి. ఇక నేటితరం యంగ్‌స్టార్స్‌లో ‘బాహుబలి’కి ముందు అందరూ చాక్లెట్‌బోయ్‌లా ఉండే మహేష్‌బాబు పేరు చెప్పేవారు. ప్రస్తుతం మాత్రం మహేష్‌ కంటే ప్రభాసే ముద్దు అంటున్నారు. ఇక ఇటీవల ప్రభాస్‌ రాజమౌళి తనయుడు కార్తికేయ వివాహానికి హాజరయ్యాడు. జైపూర్‌కోటలో జరిగిన ఈ వివాహ వేడుక సందర్భంగా ప్రభాస్‌తో కలిసి ఫొటో తీయించుకునేందుకు నాటి స్టార్‌ హీరోయిన్‌, మాజీ మిస్‌ యూనివర్శ్‌ సుస్మితాసేన్‌ కూడా పోటీ పడి తీయించుకుంది. 

గతంలో సుస్మితాసేన్‌ ఏరికోరి నాగార్జున హీరోగా కుంజుమోన్‌ నిర్మాతగా వచ్చిన ‘రక్షకుడు’ మూవీలో హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో జెడిచక్రవర్తి వంటి వారి సరసన కూడా నటించిన సంగతి తెలిసిందే. ఇక మరో విషయానికి వస్తే ఐదేళ్లకు పైగా కేవలం ‘బాహుబలి’కే పరిమితమైన ప్రభాస్‌ ప్రస్తుతం సుజీత్‌ దర్శకత్వంలో ‘సాహో’, జిల్‌ రాధాకృష్ణ దర్శకత్వంలో ‘జాన్‌’(వర్కింగ్‌ టైటిల్‌) చిత్రంలో నటిస్తున్నాడు. ఈ రెండు చిత్రాలను ఆయన సమాంతరంగా పూర్తి చేస్తున్నాడు. దీని తర్వాత ‘కెజిఎఫ్‌’ చిత్రంతో సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌లో ప్రభాస్‌ నటించనున్నాడని సమాచారం. 

యష్‌ వంటి హీరోతోనే అంత సంచలనం సృష్టిస్తే ఇక ప్రభాస్‌ అయితే తిరుగే ఉండదని చెప్పాలి. ప్రశాంత్‌ నీల్‌ తాజాగా ప్రభాస్‌తో కూడా భేటీ అయ్యాడు. ఇక ఈమూవీని గతంలో ‘భారతీయడు2’ చిత్రం చేయాలని భావించినా చివరకు ఆ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్న తెలుగు సుప్రసిద్ద నిర్మాత, పంపిణీదారుడు దిల్‌రాజు 200కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో మల్టీలాంగ్వేజ్‌లో తీయనున్నాడని తెలుస్తోంది. గతంలో దిల్‌రాజు.. ప్రభాస్‌తో ‘మున్నా, మిస్టర్ పర్ఫెక్ట్‌’ చిత్రాలను తీసిన విషయం తెలిసిందే. 



By January 04, 2019 at 06:20AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44149/prabhas.html

No comments