Breaking News

పోలీసుల దగ్గర బుక్కైన స్టార్ హీరోయిన్


బుక్కవ్వడం అంటే మీరు ఎక్స్ పెక్ట్ చేస్తున్న బుక్కింగ్ కాదండోయ్. ఎక్కువ ఇబ్బందిపెట్టకుండా డైరెక్ట్ గా మేటర్ లోకి వెళ్లిపోతే.. ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ తన సహ నటుడు దుల్కర్ సల్మాన్ కార్ లో కూర్చుని ఫోన్ చెక్ చేసుకుంటున్న ఫోటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకొంది. ఈ ఫోటోలను ముంబై ట్రాఫిక్ పోలీసులు తమ పేజ్ లో పోస్ట్ చేసి డ్రైవ్ చేస్తూ ఫోన్ చెక్ చేయడం అనేది మీ జీవితానికి చేటు అని ట్యాగ్ లైన్ లో ఇచ్చారు. వెంటనే రెస్పాండ్ అయిన సోనమ్ కపూర్.. అది షూటింగ్ లో ఫోటో అని, ఆ టైమ్ లో కారు రిగ్ చేయబడి ఉందని, మేము నడపాల్సిన అవసరం లేదని క్లారిఫై ఇచ్చినా కూడా పెద్దగా ఉపయోగం లేకపోయింది. 

ఆఖరికి దుల్కర్ సల్మాన్ కూడా ఇన్వాల్వ్ అయ్యి అదంతా షూటింగ్ లో భాగమని చెప్పినా కూడా ముంబై ట్రాఫిక్ పోలీస్ సోషల్ మీడియా అడ్మిన్ సరిగా రెస్పాండ్ అవ్వకపోగా.. వెటకారపు రిప్లై ఇచ్చాడు. దాంతో చేయని తప్పుకు ట్రాఫిక్ సిబ్బందితో క్లాస్ పీకించుకోవాల్సి వచ్చింది సోనమ్ మరియు దుల్కర్ కి. ఈ విషయమై సోనమ్ ను ట్రోల్ చేయడం మొదలెట్టారు కొందరు నెటిజన్లు. 

అయితే.. కపూర్ ఫ్యామిలీ మాత్రం ముంబై ట్రాఫిక్ పోలీస్ మీద మాత్రం సీరియస్ అయ్యింది. ఈ విషయమై ట్రాఫిక్ డిపార్ట్ మెంట్ హెడ్స్ కు కంప్లైంట్ ఇచ్చారట. మరి వారి నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. 



By December 16, 2018 at 12:41AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43874/sonam-kapoor.html

No comments