ఇలాగైతే కష్టమయ్యా విజయ్ దేవరకొండ!
అనతికాలంలోనే స్టార్ హీరోగా ఎదగడమే కాక ఎవరూ ఊహించనంత భారీ స్థాయి స్టార్ డమ్ ను సొంతం చేసుకున్న ఘనత విజయ్ దేవరకొండది. 50 కోట్లు, 100 కోట్లు గ్రాస్ వసూలు చేసిన సినిమాలున్నాయి మనోడి ఖాతాలో. ఇక యూత్ లో మనోడికున్న ఫాలోయింగ్ మామూలుది కాదు. అయితే.. ఈ క్రేజ్ ను స్టార్ డమ్ ను విజయ్ దేవరకొండ త్వరగా క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాడట. అందుకే తన రెమ్యూనరేషన్ ను భారీగా పెంచేశాడట. తన కాంటెంపరరీ హీరోస్ అయిన నాని, శర్వానంద్, నితిన్ లు కూడా ఇంకా రెమ్యూనరేషన్ గా అయిదారు కోట్లు మాత్రమే తీసుకొంటుండగా.. విజయ్ ఏకంగా 9 నుంచి 10 కోట్ల రూపాయల వరకూ రెమ్యూనరేషన్ అడుగుతున్నాడట.
ప్రస్తుతం విజయ్ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అవన్నీ ముందే సైన్ చేసిన సినిమాలు కావడంతో ఆ సినిమాల రెమ్యూనరేషన్స్ అన్నీ అయిదు కోట్ల రూపాయల లోపే. కానీ.. కొత్తగా ఎవరు అప్రోచ్ అయినా కూడా మినిమమ్ 9 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అని చెప్పేస్తున్నాడట. విజయ్ సినిమాలు ఎంత ఆడినా అది స్టార్ డమ్ బేస్ మీద కాదు కంటెంట్ బేస్ మీద ఆడాయి. విజయ్ కి నిజంగానే సూపర్ స్టార్ డమ్ ఉండి ఉంటే నోటాకు అంత భారీ నష్టాలు వచ్చేవి కాదు. కావున విజయ్ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అర్జెంట్ గా రెమ్యూనరేషన్ విషయంలో చేస్తున్న హడావుడి తగ్గించకపోతే మంచి సినిమాలు మాత్రం చేయలేడు.
ఈ విషయాన్ని విజయ్ కాస్త త్వరగా రియలైజ్ అయ్యి.. ప్రస్తుతం విహరిస్తున్న ఊహల ప్రపంచం నుంచి ఎంత త్వరగా బయటకి వస్తే అంత మంచిది.
By December 16, 2018 at 12:49AM
No comments