Breaking News

అంతే.. మోదీ అదో టైపు..!


మనదేశంలో విలాసాలకు, కేవలం తాము వేసుకునే డ్రస్‌లు, కోట్లు కోసమే కోట్లు ఖర్చుపెట్టే వారిలో నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ తర్వాత మోదీదే అగ్రస్థానం. ఆయన చెప్పేవి బీద పలుకులు. తన సోదరులు, తల్లి , భార్య ఇప్పటికీ తమ జీవితం తాము జీవిస్తున్నారని, కనీసం వారిని తనతోపాటు తన నివాసానికి కూడా తెచ్చుకోలేదని, వాజ్‌పేయ్‌లా తాను అతి నిరాండబరుడని నీతులు చెబుతూ ఉంటాడు. కానీ ఆయన వేసుకునే దుస్తుల నుంచి కలిసే వ్యక్తుల వరకు అందరు తన స్థాయిలోనే ఉండాలని కోరుకుంటూ ఉంటాడు. పేరుకి గరీబ్‌, ఛాయ్‌వాలేనే గానీ ఈయన విలాసం గురించి జాతీయ మీడియాలో వస్తున్న వార్తలు, ఆయన ఖర్చు చూస్తే సామాన్యుడి గుండె గుభేలుమంటుంది. 

ఇక ఆమద్య ఆయన ఫ్రాన్స్‌కి వెళ్లిన సందర్భంగా ప్రత్యేకంగా గ్లోబర్‌స్టార్‌ ప్రియాంకాచోప్రాకి ప్రత్యేక సమయం కేటాయించాడు. ఆ భేటీలో ఆమె మోదీ ముందు కాలు మీద కాలేసుకుని, కురచ దుస్తులు వేసుకోవడంతో నెటిజన్ల నుంచి భారీ విమర్శలు వచ్చాయి. ఇక విషయానికి వస్తే ఆయన త్వరలో ప్రియాంకాచోప్రా వివాహానికి ముఖ్య అతిధిగా రానున్నాడట. ప్రముఖ అమెరికన్‌ సింగర్‌ నిక్‌ జోనాన్‌ని ఆమె వివాహం చేసుకోనుంది. డిసెంబర్‌3న వీరి వివాహం రాజస్థాన్‌లోని ఉమైద్‌ భవనంలో ఘనంగా జరగనుంది. ప్రస్తుతం నిక్‌జోనాన్‌, ప్రియాంకా ఢిల్లీలోనే ఉన్నారు. వీరిద్దరూ కలసి వెళ్లి ప్రధాని మోదీని పెళ్లికి ఆహ్వానించనున్నారట. 

గతంలో విరాట్‌కోహ్లి-అనుష్కశర్మల వివాహ విందుకు కూడా మోదీ ముఖ్య అతిధిగా వచ్చాడు. నవంబర్‌ 28 నుంచి డిసెంబర్‌ 3 వరకు నిక్యాంకా అదేనండీ ప్రియాంకాచోప్రా-నిక్‌జోనాన్‌ల వివాహం అంగరంగవైభవంగా క్రైస్తవ, హిందు సంప్రదాయాలలో జరగనుంది. ఆ తర్వాత ముంబైలో, లాస్‌ ఏంజెల్స్‌లో భారీ విందులను ఇవ్వనున్నారు. వివాహ వేడుకకు పలు రంగాల ప్రముఖులతో 200 మంది అతిధులు హాజరుకానున్నారు. మొత్తానికి బ్రాండ్‌ అంబాసిడర్ల ఎంపిక నుంచి ప్రతి విషయంలో మన మోదీ మన దేశం ధనిక దేశమని నిరూపిస్తూ ఉన్నందుకు అందరు ఆయనకు కృతజ్ఞతలు చెప్పాల్సిందే మరి..! 



By November 25, 2018 at 05:05AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43639/narendra-modi.html

No comments